అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Pancha Maha Patakalu: జీవితంలో ఏ మనిషి చేయకూడని 5 పాపాలు ఇవే!

Pancha Maha Patakalu: పాపం...ఈ పదం రకరకాల సందర్భాల్లో వినియోగిస్తుంటారు. ఆ పాపం ఊరికే పోదు అంటారు, పాపం తగులుతుందని అంటారు.. పంచమహా పాతకాలు చుట్టుకుంటాయ్ అని కూడా అంటారు...ఇంతకీ పంచమహాపాతకాలు అంటే?

Pancha Maha Patakalu :  కొన్ని పదాలు విరివిగా వాడేస్తుంటాం. కొన్నిటికి అర్థాలు తెలిస్తే, మరికొన్నిటికి అర్థం తెలియకపోయినా దానివెనుకున్న ఉద్దేశం తెలుస్తుంది.    అలాంటి పదాల్లో ఒకటి పంచమహాపాతకాలు. నీకు పంచమహాపాతకాలు చుట్టుకుంటాయ్ అని అంటుంటారు..అసలు పంచమహాపాతకాలు అంటే ఏంటి. ఏంటా పాతకాలు?

మహా పాతకం అంటే?
మహా పాతకం అంటే నిష్కృతిలేనిది అని అర్థం. అంటే ఈ జన్మకు ఏం చేసినా ఈ పాపాలను కడుక్కోవడం సాధ్యంకాదు..వాటి ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే అని అర్థం. కొన్ని పాపాలకు పరిహారం ఉంటుంది కానీ పంచమహాపాతకాలు అని చెప్పుకునే వీటికి మాత్రం ఎలాంటి నిష్కృతి ఉండదు. అందుకే ఈ పాపాలు ప్రభావం చాలా పవర్ ఫుల్. వీటి గురించి అధర్వణ వేదంలో ఉంది...

Also Read: దోసపండుకి - మృత్యువుకి ఏంటి సంబంధం శివయ్యా!

పంచమహా పాతకాలు ఇవే

తల్లిదండ్రులను దూషించడం

తల్లిదండ్రులను దూషించేవారికి నిష్కృతి లేదు. జన్మనిచ్చిన వారి రుణం ఏం చేసినా తీర్చుకోలేం. అందుకే వారిని దూషించడమే  మహా పాపం అంటే ఇక ప్రాణాలు తీసేవారు ఆ పాపాన్ని జన్మజన్మలకి కడుక్కోలేరు...

Also Read: ఈ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు!

గురువుని ఏకవచనంలో పిలవడం

'మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అేంటూ...తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుదే. జాతకంలో పరిహారం లేని దోషాలు కూడా గురువు ఆశీశ్సులతో తొలగిపోతాయంటారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరేందుకు నిస్వార్థంగా ప్రోత్సహించే గురువుని ఏకవచనంతో పిలవకూడదు. కలలో కూడా గురువుని ఏకవచనంతో పిలవకూడదు..కలలో అలా అన్నా మనసులో లేనిదే రాదు కదా. మన ఆలోచనలే కలలకు ప్రతిరూపం అని ఊరికే చెప్పరు. పంచమహాపాతకాల్లో ఇదొకటి...

Also Read: ఫాల్గుణ మాసం (మార్చి) లో వచ్చే పండుగలివే

తాగే నీటికి కలుషితం చేయడం- నడిచే దారిని మూసేయడం

పది మంది తాగే నీటిని కలుషితం చేయడం, నలుగురూ నడిచే దారి మూసేయడం పంచమహాపాతకాల్లో మూడోది. ఎందరో దాహం తీర్చే గంగను తాగేందుకు వీల్లేకుండా చేసిన పాపానికి ఏం చేసినా పరిహారం ఉండదు. ఇక అంతా నడిచే దారిని మూసేయడం మహాపాపం. ఇలాంటి సంఘటనలు గ్రామాల్లో జరుగుతుంటాయి. రెండు కుటుంబాల మధ్య తగాదాలు వచ్చినప్పుడు దారులు మూసేయడం.. అందరికీ తాగునీళ్లిచ్చే బావుల్లో చెత్త వేయడం లాంటి పనులు చేస్తుంటారు. ఇక పట్టణాల విషయానికొస్తే దారులు మూసేయడం ఏం ఖర్మ...ఏకంగా శ్మశానాలే ఆక్రమించేస్తున్నారు. ఈ పాపాలు చేసేవారికి నిష్కృతి లేదు. ఈ ప్రభావం వారి పిల్లల ఆరోగ్యంపై పడుతుంది. వచ్చే జన్మలోనే కాదు ఈ జన్మలోనే పాప ఫలితం అనుభవించకతప్పదు. 

గోవుని అకారణంగా కొట్టడం

గోవులను కాసేవాడు, వాటితో పనిచేయించుకునేవాడు...వాటిని కంట్రోల్ చేసేందుకు కొట్టొచ్చు అది తప్పుకాదు...కానీ ఆకతాయిగా,ఎలాంటి అవసరం లేకుండా కొడితే  గోవు చర్మంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని జన్మలు ఎత్తినా ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది.

Also Read: అద్దంలో అలా చూసుకునే అలవాటుందా - అయితే మిమ్మల్ని ఈ దోషం వెంటాడుతుంది!

ఆత్మహత్య

పంచమహాపాతకాల్లో చివరిది ఆత్మహత్య. ప్రాణం తీసుకునే హక్కు మీకెక్కడుంది అసలు?
పరమేశ్వర స్వరూపంలో జీవుడిని ఇచ్చింది తండ్రి
శరీరాన్ని తయారు చేసింది తల్లి
అంటే ఈ శరీరం మీ సొంతం కాదు
ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఓ అద్దె ఇంట్లో ఉంటూ యజమానికి తెలియకుండా ఆ ఇల్లు అమ్మేయడమే.  అంటే నీది కాని ఆస్తిని, యజమానికి తెలియకుండా నువ్వు అమ్ముకోవడమే ఆత్మహత్య చేసుకోవడం అంటే. 

Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !

మొదటి నాలుగు పాపాలకు ఆ జీవుడు మాత్రమే అనుభవిస్తాడు. కానీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అటు ఐదు తరాలు, ఇటు ఐదు తరాలు సర్వనాశనం అయిపోతాయ్.  

పైన చెప్పుకున్న పంచమహాపాతకాలు అధర్వణ వేదంలో ప్రస్తావించినవి... ఇక బ్రహ్మపురాణం ప్రకారం పంచమహాపాతకాలు  ఇవి...

  • స్త్రీ హత్య ( స్త్రీ ని చంపడం)
  •  శిశు హత్య ( పిల్లల్ని చంపడం)
  • గో హత్య ( ఆవుని చంపడం)
  • బ్రహ్మ హత్య ( వేదం చదువుకున్న బ్రాహ్మణుడిని చంపడం)
  • స్వర్ణస్తేయము ( బంగారం దొంగిలించడం)


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget