అన్వేషించండి

Maha Shivaratri 2024: దోసపండుకి - మృత్యువుకి ఏంటి సంబంధం శివయ్యా!

Mahamrityunjaya Mantra: ఎన్నో మంత్రాలుండగా శివుడి మంత్రమే ఎందుకు మృత్యుంజయ మంత్రమైంది, అసలు దోసపండుకి మృత్యువుకి సంబంధం ఏంటి. ఈ మంత్రం నిత్యం జపిస్తే ఏమవుతుంది.

Maha Shivaratri 2024 Mahamrityunjaya Mantra: మార్చి 08 మహా శివరాత్రి. ఈ రోజు ఉపవాసం, జాగరణ చేసేవారు మహా మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల శివానుగ్రహం పొందుతారు.
 
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ 

భావము: అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి, సుగంధ భరితుడు అయిన శివుడిని పూజిస్తున్నాం. పండిన దోసకాయ తొడిమ నుంచి వేరుపడినట్టే మమ్మల్ని కూడా మృత్యువు నుంచి విడిపించు అని అర్థం. 

మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేల సంవత్సరాలు జీవించడం కాదు...పునర్జన్మ లేకపోవడం. అంటే మళ్లీ మళ్లీ జనన మరణాలు లేకపోవడం, ఇంకా చెప్పాలంటే ఈ జన్మలోనే ముక్తి పొందడం. ముక్తి అంటే మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, బతికి ఉండగానే పొందాల్సిన స్థితి.  ఈ ముక్తి స్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేదే ఈ మహా మృత్యుంజయ మంత్రం.

దోసపండు - మృత్యువుకి ఏంటి సంబంధం

ఉర్వారుక అంటే దోసపండు. సాధారణంగా దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుంచి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానం పొందిన వ్యక్తి కూడా ఈ దోసపండు మాదిరిగా అలవోకగా ప్రాపంచికత నుంచి విడవడతాడు. అంటే మాయనుంచి  బయటపడతాడన్నమాట. పండిన దోసపండు తొడిమ నుంచి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన ఉన్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలైన ఈ సంసారం అనే మాయనుంచి  విడిపోయినా దేహ ప్రారబ్ధం తీరేంతవరకు జీవుడు అక్కడే ఉంటాడు.  అంటే ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. 

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు

మహా మృత్యుంజయ మంత్రం ఎలా జపించాలి

ఈ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చారణ చేయవచ్చు. 12 ని 9 తో గుణిస్తే 108 వస్తుంది...అంటే  ఇక్కడ 12 రాశిచక్రాలను, 9 గ్రహాలను సూచిస్తుంది. మానవులు అన్ని గ్రహాలు,  రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు తగ్గి ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు. ఇది ఏకాగ్రతను మెరుగుపరచి మంచి నిద్రకు సహాయపడుతుంది.

Also Read: ఈ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు!

మృత సంజీవని మృత్యుంజయ మంత్రం

మహా మృత్యుంజయ మంత్రం జపించటం వల్ల భయం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. గాయత్రి మంత్రంలా మహా మృత్యంజయ మంత్రం పరమ పవిత్రమైనది. క్షీర సాగన మథనంలో వచ్చిన హాలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు.  ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులవుతారని విశ్వాసం. అంటే ఈ మంత్రాన్ని  మృత సంజీవని అని కూడా చెప్పొచ్చు. 

Also Read: ఈ రోజు ఈ రాశులవారికి రొమాంటిక్ డే, ఫిబ్రవరి 28 రాశిఫలాలు

శివశివేతి శివేతి శివేతి వా
భవభవేతి భవేతి భవేతి వా 
హరహరేతి హరేతి హరేతి వా
భజమనశ్శివమేవ నిరంతరమ్ 

ఓం నమః శివాయ

Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Embed widget