లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ ఫొటోను ఇంట్లో పెట్టుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
చాలా మంది ఇంట్లోనూ, ఆపీసులోనూ గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహం పెట్టుకుంటారు. మరి అలా పెట్టుకోవడం మంచిదేనా?
గుడ్లగూబను లక్ష్మీ వాహనంగా పరిగిణిస్తారు. వాస్తు ప్రకారం గుడ్లగూబ పవిత్రమైంది కూడా. అందుకే చాలా మంది ఇంట్లోనూ, ఆపీసులోనూ గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహం పెట్టుకుంటారు. మరి అలా పెట్టుకోవడం మంచిదేనా?
ఇట్లు, ఆఫీస్‌లలో పాజిటివ్ ఎనర్జీని నిర్ధారించడానికి తప్పకుండా వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుంది. అదే విధంగా చాలా మంది కార్యాలయాలు, ఇళ్లలో కూడా గుడ్లగూబల ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టుకుంటారు. మరి కొంత మంది గుడ్లగూబను అపశకునంగా భావిస్తారు. మరి వాస్తు దీని గురించి ఏమంటుందో తెలుసుకుందాం.
హిందుత్వంలో ప్రతి దేవతకు కూడా తప్పనిసరిగా వాహనం ఉంటుంది. దేవతలు తమకు నచ్చిన జంతువును లేదా పక్షిని తమకు వాహనాలుగా ఎంచుకున్నారని నమ్మకం. గణేషుడి వాహనం ఎలుక, దుర్గాదేవి వాహనం సింహం ఇలా లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.
గుడ్లగూబ పక్షిజాతికి చెందిన జీవి. హిందుత్వంలో గుడ్లగూబ చుట్టూ రకరకాల నమ్మకాలు ఉన్నాయి. కొంతమంది గుడ్లగూబను శుభప్రదంగా భావిస్తే మరికొందరు దీనిని అపశకునంగా భావిస్తారు. గుడ్లగూబ ఫోటోలు లేదా విగ్రహాలు లక్ష్మీ అనుగ్రహాన్ని తెస్తాయని నమ్మకం. అయితే వాస్తును అనుసరించి సరైన దిక్కున నియమాలను అనుసరించి ఇంట్లో లేదా ఆఫీస్ లో ఈ పక్షి బొమ్మలను పెట్టుకోవచ్చు. అయితే నియమాలు పాటించడం తప్పనిసరి.
ఆఫీసులో...
ఆఫీస్ లేదా పని ప్రదేశాల్లో గుడ్లగూబ విగ్రహం పెట్టుకోవడం వల్ల విజయాలు మీకు సొంతమవుతాయి. ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఒక మార్గం. అంతేకాదు ఆఫీస్ లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహానికి ఉన్న ఆటంకాలు తొలగి పోతాయి. ఆఫీస్ లేదా దుకాణంలోని కౌంటర్లో లేదా ఖాతా పుస్తకాల దగ్గర లేదా మీ కంప్యూటర్ డెస్క్ మీద గుడ్లగూబ విగ్రహం లేదా పటం పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైనా గుడ్లగూబ మీకు కుడి పక్కన ఉండేట్టు జాగ్రత్త పడాలి. దీని వల్ల మీ పనిలో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగి పోయి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.
ఇంట్లో...
ఇంట్లో గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలని అనుకుంటే లివంగ్ రూమ్, పూజగది, స్టడీ రూమ్ లో దీన్ని పెట్టుకోవచ్చు. ఇంట్లో గుడ్లగూబ విగ్రహం లేదా పటం ఉండడం చాలా మంచిది. ఇంట్లో గ్లూడ్లగూబ ఉండడం వల్ల చెడుదృష్టి సోకకుండా ఉంటుంది. ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో అందరికీ కనిపించేట్టుగా గుడ్లగూబను పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇంటి ముఖద్వారంలో నుంచి కనిపించేట్టుగా పెట్టుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫోటోకు దగ్గరగా గుడ్లగూబ విగ్రహం లేదా పటాన్ని పెట్టుకోవడం కూడా చాలా మేలు చేస్తుందని నమ్మకం. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుందట.
Also read : డస్ట్ బిన్ ఇక్కడ పెడితే దరిద్రం వెంటాడుతుంది - ఈ తప్పులు అస్సలు చెయొద్దు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.