(Source: ECI/ABP News/ABP Majha)
Vastu Tips in Telugu: డస్ట్ బిన్ ఇక్కడ పెడితే దరిద్రం వెంటాడుతుంది - ఈ తప్పులు అస్సలు చెయొద్దు
ప్రతి కట్టడం నియమాలను అనుసరించి ఉండాలని వాస్తు సూచిస్తుంది. కేవలం కట్టడాలు మాత్రమే కాదు, పూర్తయిన ప్రతి భవనంలోనూ వస్తువుల అమరిక కూడా వాస్తులో ముఖ్యమే.
వాస్తు జీవన విధానాన్ని వివరిస్తుంది. ప్రతి రోజూ మనం గడిపే జీవిత నియమాలన్నీ కూడా వాస్తు శాస్త్రంలో పొందుపరిచారు. వాస్తు సూచించే నియమాలు నిత్య జీవితాన్ని నడిపేవని నమ్మకం. వీటిని నిర్లక్ష్యం చేస్తే కొన్ని సార్లు అనర్థాలు జరగే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రతి కట్టడం నియమాలను అనుసరించి ఉండాలని వాస్తు సూచిస్తుంది. కేవలం కట్టడాలు మాత్రమే కాదు, పూర్తయిన ప్రతి భవనంలోనూ వస్తువుల అమరిక కూడా వాస్తులో ముఖ్యమే. కనుక వాస్తు చెప్పే సూచనలను నిర్లక్ష్యం చెయ్యడం తగదు.
వాస్తు శాస్త్రంలో దిక్కులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తును అనుసరించి ఇంట్లో వస్తువులను అమర్చుకోకపోతే అది ఆకుటుంబం మీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక వస్తువులను అమర్చుకునే సమయంలొ తప్పుండా వాస్తు నియమాలు తెలుసుకుని పాటించడం అవసరం. కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. వాస్తు విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా చాలా సమస్యలు రావచ్చు. అందుకే వాస్తు తెలుసుకోవడం చాలా అవసరం.
ప్రతి ఇంటిలోనూ డస్ట్ బిన్ (చెత్త బుట్ట) తప్పకుండా ఉంటుంది. కానీ డస్ట్ బిన్ ఎక్కడ పెడుతున్నామనే విషయం మీద పెద్దగా దృష్టి నిలపరు. కానీ డస్ట్ బిన్ సరైన స్థానంలో ఉంచకపోతే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరుతుంది. కనుక డస్ట్ బిన్ విషయంలో వాస్తు చెబుతున్న నియమాలు తెలుసుకుందాం.
ఇక్కడ అసలు పెట్టకూడదు
వాస్తు ప్రకారం వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చేరేందుకు దోహదం చేస్తుంది. అదేవిధంగా పెట్టకూడని చోట పెట్టినపుడు చాలా నష్టం కూడా జరుగుతుంది.
చెత్తబుట్టను ఎప్పుడూ కూడా ఈశాన్యంలో ఉంచకూడదు. ఇంట్లో ఈశాన్యం దేవతల నెలవు. అందుకే అక్కడ చెత్తబుట్ట పెట్ట కూడదు. అలా చేస్తే వాస్తు దోషం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మీద నేరుగా నెగెటివ్ ప్రభావం పడుతుంది.
ఈశాన్యంలో చెత్తబుట్ట పెట్టినపుడు ఆ ఇంట్లో ఉండే వారిలో మానసిక సమస్యలు రావచ్చు. ఈశాన్యం మాత్రమే కాదు, తూర్పు, ఆగ్నేయ, ఉత్తర దిక్కున కూడా చెత్తబుట్ట పెట్టకూడదు. ఈ దిక్కుల్లో చెత్తబుట్ట పెడితే ఇంట్లో దరిద్ర్యాం చేరే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయి.
ఎక్కడ పెడితే మంచిది?
వాస్తు ప్రకారం చెత్తబుట్ట ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. నైరుతి లేదా వాయవ్యంలో పెట్టడం మంచిది. ఈ దిక్కుల్లో పెట్టడం వల్ల వాస్తుదోషాలు రావు. ఇంట్లో సుఖ శాంతులు వెల్లివిరియాలంటే తప్పకుండా వాస్తు నియమాలు అనుసరించాలి.
Also read : Vastu tips: లాకర్‌లో ఈ నాలుగు వస్తువులు ఉంటే దరిద్రం తప్పదు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.