అన్వేషించండి

ఈ విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తే అదృష్టం మీ వెంటే

కొన్ని జంతువులను ప్రత్యేక దేవతలకు ప్రతీకలుగా భావిస్తారు. అందువల్ల కొన్ని రకాల విగ్రహాలు, పటాలు పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. అంతేకాదు అర్థిక స్థితి గతులు కూడా మెరుగవుతాయి.

Vastu Tips: అందమైన ఇంటి గురించి కలలు కనని వారు ఉండరు. ఇల్లు అందంగా అలంకరించుకోవాలని అందరూ అనుకుంటారు. చిన్నదైనా పెద్దదైనా ఇంటి అలంకారం ఇష్టం ఉండని వాళ్లు ఎవరూ ఉండరు. మనం ఉండే ప్రదేశం శుభ్రంగా అందంగా ఉంటే ప్రశాంతంగా ఉండడమే కాదు, జీవితంలోకి ఆనందాలను కూడా తెస్తాయి. దేవతా మూర్తులు, జంతువుల చిత్రాలు, విగ్రహాలు ఇంటి అలంకరణకు వాడుతుంటారు. అయితే ప్రతి జంతువు, పక్షి కూడా ఏదో ఒక గ్రహానికి చెందినవిగా నమ్ముతారు. ఆ గ్రహాల ప్రభావం కూడా ఇంటి మీద ఉంటుందని నమ్మకం. వాస్తు శాస్త్రం ఇంటి అలంకరణ గురించి కూడా చాలా విషయాలను చర్చిస్తుంది. వాస్తులో ఇంటి అలంకారానికి ఎలాంటి వస్తువులు వాడాలి, ఎలాంటి చిహ్నాలను పెట్టుకోవచ్చు. విగ్రహాలైనా, చిత్రాలైనా ఎలాంటివి అమర్చుకోవచ్చనే విషయాలను గురించి వివరణలు అందుబాటులో ఉన్నాయి.  కొన్ని జంతువుల విగ్రహాలను ఇంట్లో అలంకరించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అవేంటో చూసేయండి మరి.

ఏనుగుల జత

వాస్తు ప్రకారం ఇంట్లో ఒక జత ఏనుగులను అలంకరించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఏనుగుల జత ఇంట్లో ఉంటే కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో వెండి లేదా ఇత్తడి ఏనుగులు ఉండడం చాలా మంచిది.

తాబేలు

తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. తాబెలు బొమ్మ ఉన్న ఇంట్లో లక్ష్మీ తాండవిస్తుందని అంటారు. ఇంట్లో తూర్పూ లేదా ఉత్తర దిశలో తాబేలు ఉంచడం వల్ల ఆనందం, సమృద్ధి వస్తుందని శాస్త్రం చెబుతోంది.

పెద్ద బాతుల జంట

వాస్తు ప్రకారం ఒక జత పెద్ద బాతుల విగ్రహాన్ని పడక గదిలో పెట్టుకోవడం మంచిదని భావిస్తారు. ఇలా బాతుల విగ్రహాన్ని అలంకరిస్తే దంపతుల మధ్య ప్రేమాభిమానాలు పెంపొందుతాయని శాస్త్రం చెబుతోంది.  అంతేకాదు ఇంట్లో కుటుంబసభ్యుల మద్య అనుబంధాలు బలోపేతం అవుతాయట.

చేప

వాస్తులో చేపను సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఇత్తడి లేదా వెండి చేపలను ఇంట్లో అలంకరించడం వల్ల ఆనందం సమృద్ధి వచ్చి చేరుతాయి. ఈశాన్యం లేదా తూర్పు దిశలో చేపల విగ్రహాన్ని ఉంచడం శుభప్రదం అని పండితులు సూచిస్తున్నారు.

ఆవు

సనాతన సంప్రదాయం చెప్పిన దాన్ని బట్టి సకల దేవతలకు గోవు ఆవాసం. అందుకే గోవును సకల దేవతలకు ప్రతీకగా భావిస్తారు. అటువంటి ఆవు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయట.

ఒంటె

ఇంట్లో ఒంటె విగ్రహం కూడా శుభప్రదం. ఒంటె పోరాట విజయాలకు ప్రతీక. డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్ లో వాయవ్య దిశలో ఒంటె విగ్రహం ఉంచడం వల్ల చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు విజయపథాన సాగుతాయి.

ఇంటి అలంకారం విషయంలో కొద్ది జాగ్రత్తలు పాటించడం, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తెచ్చే అలంకరణ సామాగ్రి పెట్టుకోవడం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget