అన్వేషించండి

మీ ఇంట్లో గడియారం ఈ దిక్కున ఉందా? వెంటనే తీసేయండి, లేకపోతే..

వాస్తు ప్రకారం ఏ దిశలో ఏ వస్తువు ఉంచితే శుభ ప్రదమో తెలుసుకుని ఆవిధంగా ఇంట్లో వస్తువులు అమర్చుకోవడం వల్ల ఇంట్లొ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

ఇంట్లో ఏ దిశలో ఏ వస్తువులు ఉంచాలనేది వాస్తు శాస్త్రం వివరిస్తుంది. వాస్తులో దిక్కులు చాలా ముఖ్యమైనవి. ఇంట్లో ఏ దిక్కున ఎలాంటి వస్తువు పెట్టాలి. ఏ మూలన బరువైన వస్తువులు ఉండకూడదు, ఎటువైపు బరువు తప్పనిసరిగా ఉండాలి వంటి విషయాలన్నీ కూడా వాస్తు చక్కగా వివరించింది.

జీవితం అంటే కాలమే. కాలమంటే దైవమే. అటువంటి కాలాన్ని కొలమానంలో పెట్టి మనకు చూపించే పరికరం గడియారం. ఇది మనకు కాలపురుషుడి గమనాన్ని తెలియజేస్తుంది. అటువంటి పరికరం వాస్తును అనుసరించి ఇంట్లో ఏ దిక్కున అమర్చుకోవాలో తెలుసుకుందాం.

ఇంట్లో ఎప్పుడూ కూడా చెడిపోయిన లేదా ఆగిపోయిన గడియారం ఉంచకూడదని వాస్తు చెబుతోంది. అలా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉండడం అశుభానికి ప్రతీకగా వాస్తు హెచ్చరిస్తోంది. చెడిపోయిన లేదా ఆగిపోయిన గడియారాలు ఇంట్లోకి నెగెటివిటిని ఆహ్వానిస్తాయట. అందువల్ల పగిలిపోయిన లేదా ఆగిపోయిన గడియారాలను ఇంట్లో పెట్టుకోకూడదు.

ఇటు వైపు అసలు వద్దు

దక్షిణ దిశను యమస్థానంగా పరిగణిస్తారు. అందుకే గడియారాన్ని ఎప్పుడూ ఇటు వైపుగా పెట్టకూడదు. అంతేకాదు ఇంటికి పడమర దిక్కున కూడా గడియారాన్ని పెట్టకూడదు.

ప్రధాన ద్వారం పైన వద్దు

వాస్తుప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై గడియారాన్ని ఉంచడం అసలు మంచిది కాదు. అక్కడ పెడితే.. ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతుంటాయి. వాతావరణం ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడూ తెలియని ఒక టెన్షన్ ఉంటుంది. అందుకే ప్రధాన ద్వారం పైన ఉన్న గోడ దగ్గర గడియారం పెట్టకూడదు.

ఇక్కడ పెడితే మంచిది?

వాస్తు ప్రకారం గడియారాన్ని ఎప్పుడు ఉత్తరం లేదా తూర్పు దిశలో పెట్టుకోవాలి. ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. ఇంట్లో ప్రేమానురాగాలు వెల్లి విరుస్తాయి. బెడ్ రూమ్‌లో గోడ గడియారం పెట్టుకోకూడదు. ఇది నిద్రకు ఆటంకం మాత్రమే కాదు, పీడకలలు రావడానికి కూడా కారణం అవుతుంది.

అలంకరణ వస్తువులు, చిత్రాలు ఈ దిశలో పెట్టుకోవడం మంచిది

  • ఈశాన్యానికి బృహస్పతి అధిపతి. అందువల్ల అటువైపు తప్పనిసరిగా దేవుడి ఫోటోలు పూజస్థానం ఉండేలా చూసుకోవాలి. అయితే దేవుడి విగ్రహాలు లేదా పటాలు తూర్పు అభిముఖంగా ఉండాలి.
  • హింసను ప్రతిబింబించే చిత్రాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి ఇంటిలోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
  • చంద్రుడు వాయవ్యాధిపతి ఈ దిక్కులో వ్యర్థాలు పడెయ్య కూడదు. చీకటిగా కూడా ఉండకూడదు. ఇలా చేస్తే ఇంట్లోని స్త్రీలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు.
  • కాబట్టి ఇంట్లో వస్తువులను అమర్చేసమయంలో లేదా అలంకార వస్తువులు పెట్టుకునే సమయంలో వాస్తును అనుసరించి అవి ఇంట్లో ఉండవచ్చో లేదో ఒకవేళ ఉంటే ఎక్కడ, ఏదిశలో ఉండాలి వంటి అన్ని విషయాలను కూలంకశంగా తెలుసుకుని ఇంటికి ఇంటిరీయర్స్ చేయించుకుంటే.. ఇల్లు అందంగా ఉండడం మాత్రమే కాదు, ఎనర్జిటిక్ గా కూడా ఉంటుంది.

Also Read: నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలు, మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారో తెలుసా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court : విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు  స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
Free Bus Service: ఏపీలో ఫ్రీ బస్ సర్వీస్ - ఆ రోజు నుంచే ప్రారంభం, అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
Free Bus Service: ఏపీలో ఫ్రీ బస్ సర్వీస్ - ఆ రోజు నుంచే ప్రారంభం, అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
Anganwadi Workers: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలపై కీలక ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలపై కీలక ఆదేశాలు
Allu Arjun: అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసిన మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసిన మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PCB Threatened BCCI Regarding 2025 Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్‌లో కొత్త అప్‌డేట్ | ABP Desamటీ20ల్లో ఓపెనర్లుగా ఈ నలుగురిలో ఎవరికి ఛాన్స్ | ABP DesamAnant Ambani gifts 2Cr Worth Watches |పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ కి కళ్లు చెదిరే గిఫ్టులిచ్చిన అంబానీVizianagaram Fort Lesser Known Story | దేశానికి ఆఖరి కోటగా చెప్పే విజయనగరం కోటపై ఆసక్తికర విషయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court : విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు  స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
Free Bus Service: ఏపీలో ఫ్రీ బస్ సర్వీస్ - ఆ రోజు నుంచే ప్రారంభం, అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
Free Bus Service: ఏపీలో ఫ్రీ బస్ సర్వీస్ - ఆ రోజు నుంచే ప్రారంభం, అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
Anganwadi Workers: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలపై కీలక ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలపై కీలక ఆదేశాలు
Allu Arjun: అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసిన మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసిన మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ ఎక్కడ? - విచారణకు హాజరు కావాలని హెచ్చరిస్తూ హీరోకి పోలీసుల నోటీసులు
రాజ్‌ తరుణ్‌ ఎక్కడ? - విచారణకు హాజరు కావాలని హెచ్చరిస్తూ హీరోకి పోలీసుల నోటీసులు
JD Vance Wife Usha Chilukuri Vance: అమెరికా ఉపాధ్యక్షఅభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి కులం ఏంటీ? సోషల్ మీడియాలో బిగ్ డిస్కషన్
అమెరికా ఉపాధ్యక్షఅభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి కులం ఏంటీ? సోషల్ మీడియాలో బిగ్ డిస్కషన్
Double ISmart: 'హను-మాన్' నిర్మాతల చేతికి 'డబుల్ ఇస్మార్ట్' - 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయంటే?
'హను-మాన్' నిర్మాతల చేతికి 'డబుల్ ఇస్మార్ట్' - 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయంటే?
Crime News: ఏపీలో మరో దారుణం - గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో అనుమానాస్పదంగా మైనర్ మృతదేహం
ఏపీలో మరో దారుణం - గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో అనుమానాస్పదంగా మైనర్ మృతదేహం
Embed widget