Ugadi 2022: ఏప్రిల్ 2 ఉగాది రోజు ఈ టైంలోగా పచ్చడి తినేయాలి
శ్రీ ప్లవనామ సంవత్సరం పూర్తిచేసుకుని శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం.ఏప్రిల్ 2 శనివారం ఉగాది రోజు పాడ్యమి తిథి వెళ్లి విదియ వచ్చేలోగా పూజ, నైవేద్యం, ప్రసాదం తినడం పూర్తైపోవాలి.ఎందుకంటే
చాలా పండుగల్లా ఈ సారి కూడా తిథులు తగులు-మిగులు వచ్చాయి. మార్చి 31 గురువారం మధ్యాహ్నానికి వచ్చిన అమావాస్య శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఆఖరి రోజైన ఏప్రిల్ 1 శుక్రవారం ఉదయం 11.49 వరకూ ఉంది. అంటే 11.50 నుంచి శుక్లపక్ష పాడ్యమి మొదలైంది. పాడ్యమి అంటే ఏడాదికి ఆరంభం...చైత్రమాసంలో వచ్చే పాడ్యమి రోజే ఉగాది జరుపుకుంటాం. అయితే చాలా పండుగలకు సూర్యోదయమే మూలం. సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణలోకి తీసుకుంటాం. అయితే దీపావళి అమావాస్య, కార్తీక పౌర్ణమి , అట్ల తదియ లాంటి పండుగల సమయంలో సాయంత్రానికి తిథి ఉండడం ప్రధానం. ఎందుకంటే అవి సూర్యాస్తమయం తర్వాత జరుపుకునే పండుగలు కాబట్టి. ఇక ఉగాది విషయానికొస్తే పాడ్యమి ఏప్రిల్ 1 శుక్రవారమే వచ్చినప్పటికీ శనివారం సూర్యోదయానికి ఈ తిథి ఉంది. శుక్రవారం ఉదయం దాదాపు 12 గంటలసమయంలో వచ్చిన పాడ్యమి...శనివారం ఉదయం 11గంటల 43 నిముషాల వరకూ ఉంది. ఈ లెక్కన ఆ సమయంలోగా పూజ, ప్రసాదం పూర్తైపోవాలన్నమాట.
Also Read: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే
ఇక ఉగాది గురించి చెప్పుకుంటే “ఋతూనాం కుసుమాకరాం” అని శ్రీకృష్ణపరమాత్ముడు భగవద్గీతలో స్వయగంగా చెప్పాడు. అంటే తానే వసంతఋతువునని అర్థం. వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా చైత్రమే. అయితే చైత్రమాసం అనగానే ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి కానీ దశావతారాల్లో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ లాంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలో ఉన్నాయి. అందుకే చైత్రం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసంగా కూడా చెబుతారు. ఈ నెలలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.
Also Read: 2022-2023 ఈ రాశులవారికి అద్భుతంగా ఉంటే, ఆ రెండు రాశులవారికి అరాచకంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
ప్రకృతి చిగురించే ఈ వసంతకాలాన్ని చెట్లూ , చేమలే కాదు , పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. సంవత్సరానికి యుగం అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది , ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుంచీ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది రోజు నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. సృష్టి మొదలు అయిన రోజున సృష్టికి మూలకారకుడైన బ్రహ్మని పూజించి తమ జీవితంలో అన్ని రుచులూ ఉండాలని కోరుతూ షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవిస్తారు. ఈ రోజన పంచాంగ శ్రవణం , తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం, కవి సమ్మేళనం పండుగకు మరింత శోభనితీసుకొస్తాయి.
Also Read: 2022-2023 ఈ రాశులవారికి అదృష్టం కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు , ఇందులో మీ రాశి ఉందా ఇక్కడ తెలుసుకోండి
Also Read: శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి