News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tirumala Updates: శ్రీనివాసుడికి ఇష్టమైన శనివారం తిరుమలలో జరిగే ప్రత్యేక సేవలు మీకు తెలుసా !

Special Pooja Performed at Tirumala: బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలుపుతారు. శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను అర్చకులు నివేదిస్తారు.

FOLLOW US: 
Share:

Special Pooja Performed at Tirumala: శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలువబడుతుంది.. ఈ క్రమంలో ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను అర్చకులు నివేదిస్తారు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.

పచ్చ కర్పూరం అద్ది గొల్ల హారతి..
శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తరువాత గొల్ల హారతి సమర్పణ జరుగుతుంది.. తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థంను అందిస్తారు.. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది.. మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు.. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు.. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేసిన అర్చకులు.. తోమాల సేవ ప్రారంభిస్తారు.. ముందుగా ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. 

ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు.. శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది.. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ ,పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు.. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. ఈ తంతుతో తోమాల సేవ పూర్తి అవుతుంది.. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.. 

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి, సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు.. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు.. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది.

స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు. అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు.. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు.. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు..

శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వారికి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు.. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఒంజల్ సేవను నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారుq. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు.. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల,రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

Published at : 16 Jul 2022 09:34 AM (IST) Tags: Tirumala news tirupati Tirumala Tirumala Tirupati Devasthanam Tirumala News Today

ఇవి కూడా చూడండి

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Spirituality:  సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?

What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా  - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?

Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం

Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం

Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్

Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్

Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్‌

Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్‌