అన్వేషించండి

Navratri 2025: నవరాత్రి సమయంలో సాంప్రదాయ దుస్తులు, పూజలు, ప్రసాదాల గురించి తెలుసుకోండి!

Navratri Dress Code: నవరాత్రి సమయంలో సాంప్రదాయ పద్ధతులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వైవిధ్యంగా ఉంటాయి. దుస్తుల కోడ్, అలంకరణలు, జానపద ఆచారాలు ఈ పండుగకు ప్రత్యేక శోభను తెస్తాయి. 

Sharadiya Navratri 2025: శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 22 సోమవారం ప్రారంభమవుతాయి.. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో అమ్మవారుభక్తులను అనుగ్రహిస్తుంది. పదో రోజు విజయదశమితో వేడుకలు ముగుస్తాయి. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల కోడ్, అలంకరణలు, జానపద ఆచారాల గురించి తెలుసుకోండి

దుస్తుల కోడ్

నవరాత్రి సమయంలో మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. తెలుగు సంప్రదాయంలో చీరలు, లంగా-వోణి , అనార్కలీ డ్రెస్ లు వేసుకుంటారు. 

అలంకారమే ప్రత్యేక ఆకర్షణ

మహిళలు బంగారు ఆభరణాలు, జడకుచ్చులు ధరిస్తారు. సింధూరం, కుంకుమ, గోరింట,కాళ్లకు పారాణి ..ఇవన్నీ అలంకరణలో భాగమే.
 
రంగులు

శరన్నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల్లో...అమ్మవారి రూపాలకు అనుగుణంగా నిర్దిష్ట రంగుల దుస్తులు ధరించే సంప్రదాయం ఉంది. మొదటి రోజు శైలపుత్రి తెలుపు, రెండో రోజు బ్రహ్మచారిణి ఆకుపచ్చ, మూడో రోజు చంద్రఘంట ఎరుపు..ఇలా రోజుకో రంగుకి ప్రాధాన్యత ఇస్తారు.
 
పురుషులు సాధారణంగా పంచె (ధోతీ), కుర్తా-పైజామా, షేర్వాణీ ధరిస్తారు. పట్టు పంచెలు, జెరీ ఉన్న కుర్తాలు ప్రత్యేక సందర్భాలలో ఎక్కువగా కనిపిస్తాయి. 
 
అలంకరణలు

ఇంటిని రంగవల్లులతో అలంకరిస్తారు. ద్వారాలకు పసుపురాసి..గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు. 

జానపద ఆచారాలు

బొమ్మల కొలువు
కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి బొమ్మలకొలువు పెడితే.. మరికొన్ని ప్రాంతాల్లో దసరాకి బొమ్మల కొలువుపెతారు. వివిధ రకాల బొమ్మలను ఓ క్రమపద్ధతిలో అమర్చి..పూజలు చేస్తారు.ఇరుగుపొరుగువారిని పిలిచి బొమ్మల కొలువు చూపించి.. వారికి పసుపు కుంకుమ , గాజులు అందిస్తారు.
 
దండియా & గర్బా
గుజరాతీ సంప్రదాయమైన దండియా, గర్బా నృత్యాలు తెలుగు రాష్ట్రాలలో కూడా జనాదరణ పొందాయి. ఈ నృత్యాలు సామూహికంగా రంగురంగుల దుస్తులు ధరించి సంబరంగా జరుపుకుంటారు

బతుకమ్మ
తెలంగాణలో నవరాత్రి సమయంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటారు. వివిధ పూలతో బతుకమ్మను అలంకరించి, స్త్రీలు సామూహికంగా నృత్యం చేస్తూ, పాటలు పాడతారు. ఇది దేవి యొక్క శక్తిని, ప్రకృతిని కొనియాడే సంప్రదాయం. అయితే దసరా ప్రారంభం కన్నా ఓరోజు ముందే బతుకమ్మ మొదలవుతుంది. భాద్రపద అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలై.. సద్దుల బతుకమ్మతో వైభవంగా ముగుస్తాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగ వేళ మహిళల ఆటపాటలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.

పూజలు & హోమాలు
నవరాత్రి తొమ్మిది రోజులు రోజుకో రూపాన్ని ఆరాధించడంతో పాటూ..ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహిస్తారు. దసరా రోజున ఆయుధ పూజ, వాహన పూజ చేస్తారు. జమ్మిచెట్టుని పూజిస్తే అన్నీ శుభాలే జరుగుతాయని నమ్మకం

ప్రసాదాలు
నవరాత్రి సమయంలో పులిహోర, పొంగలి, చక్కెర పొంగలి, కేసరి, పాయసం వంటి సాంప్రదాయ వంటకాలు తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి భక్తులకు పంచుతారు.

ప్రాంతీయ వైవిధ్యం
ఆంధ్రప్రదేశ్: బొమ్మల కొలువు, దేవి పూజలు, సాంప్రదాయ వంటకాలు దసరా ప్రత్యేకం
తెలంగాణ: బతుకమ్మ, పూల అలంకరణలతో సందడే సందడి
గుజరాత్‌లో గర్బా/దండియా, బెంగాల్‌లో దుర్గా పూజ, కర్ణాటకలో మైసూర్ దసరా  ప్రసిద్ధమైనవి

గమనిక:

 ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. 

2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

 దసరా నవరాత్రి కలశ స్థాపన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత! ఎలాంటి కలశ పెట్టాలి తెలుసుకునేందుకు...ఈ లింక్ క్లిక్ చేయండి



 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget