By: ABP Desam | Updated at : 07 May 2022 05:33 AM (IST)
Edited By: RamaLakshmibai
Today Panchang May 7th
మే 7 శనివారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 07- 05 - 2022
వారం: శనివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం
తిథి : షష్టి శనివారం ఉదయం 11.09 వరకు తదుపరి సప్తమి
వారం : శనివారం
నక్షత్రం: పునర్వసు ఉదయం 9.06 తదుపరి పుష్యమి
వర్జ్యం : సాయంత్రం 5.52 నుంచి 7.37
దుర్ముహూర్తం : ఉదయం 7.17 నుంచి 8.59 తిరిగి మధ్యాహ్నం 12.22 నుంచి 1.13 వరకు
అమృతఘడియలు : ఉదయం 6.16 నుంచి 7.17
సూర్యోదయం: 05:36
సూర్యాస్తమయం : 06:18
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది
శనిదోష నివారణకు పఠించాల్సిన శ్లోకాలు
శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు.కష్ట నష్టాల నుంచి బయపడేందుకు దేవాలయాల్లో శాంతులు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే శనివారం రోజు ప్రత్యేక పూజలు మాత్రమే కాదు శనిధ్యానం చేసినా ఆ ప్రభావం తగ్గుతుందని చెబుతారు. ఇవి కేవలం శనివారం మాత్రమే కాదు నిత్యం చదువుకోవచ్చు.
శని గాయత్రి:
ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి
తన్నః శనిః ప్రచోదయాత్
శనిధ్యానం శ్లోకాలు
సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని:
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం!
నమస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో !!
నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్రణతస్యచ!!
నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే !!
నిత్యం ఈ శ్లోకాలు చదవడం వల్ల ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణతో పాటూ అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు చెబుతారు.
Also Read: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు
Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు
Panakala Swamy Temple :ప్రసాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు
Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Revant Reddy : కేసిఆర్ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్బాడీ అప్పగింత
Thailand Open: ప్చ్.. సింధు! చెన్యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !