Shani Dev: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది

జాతకాలను విశ్వశించేవారు ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా భయపడరు కానీ శని విషయంలో మాత్రం టెన్షన్ పడతారు. ఏలినాటి శని, అర్టాష్టమ శని, అష్టమ శని ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని భావిస్తారు ఎందుకంటే..

FOLLOW US: 

జన్మ రాశి నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని దీనిని ఏలినాటి శని అంటారు.

శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, మందులు వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి
జన్మరాశిలో అంటే శని ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలపనిందలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్సాంతి ఉండకపోవడం, ధనవ్యయం, రుణబాధలు,వృత్తి-ఉద్యోగం-వ్యాపారంలో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది. 
శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తికాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది. 

జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని 'మంగుశని' అంటారు. రెండోసారి వచ్చే ఏల్నాటి శనిని 'పొంగుశని' అని అంటారు. ఈ కాలంలో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏదో ఒక సందర్భంలో సమస్యలకు కాస్తైనా బ్రేక్ పడుతుంది. కానీ మూడోసారి వచ్చిన శనిని 'మృత్యుశని' అంటారు. ఈ దశలో అనారోగ్య సమస్యలు, అపమృత్యు భయం తప్పవు. ప్రాణం పోయేంతవరకూ పరిస్థితులు వెళతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

ఇక 12,1,2 స్థానాల్లో శనిసంచారాన్ని ఏలినాటి శని అంటే... జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్న శనిని అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషమే.

అర్ధాష్టమ శని
జన్మరాశి నుంచి నాలగవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.స్ధాన చలనం,స్ధిరాస్తి సమస్యలు,వాహన ప్రమాదాలు,తల్లికి అనారోగ్యం ఉంటుంది.

అష్టమ శని
జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.శత్రు బాధలు,ఊహించని నష్టాలు వస్తాయి.

దశమ శని
జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి.

Also Read: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు

అయితే మీ జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, గోచారంలో గురుబలం ఉన్నప్పుడు శని అంతగా బాధించదు.ఇక శనిదోషం నుంచి ఉపశమనం పొందాలంటే శనివారం శనికి తైలాభిషేకం, జపాదులు చేయించుకోవచ్చు.  మరో ముఖ్యవిషయం ఏంటంటే శని శ్రమకారకుడు. బద్ధకాన్ని అస్సలు సహించడు. శ్రమకారక జీవులైన చీమలకు పంచదారం వేయడం, పశు-పక్ష్యాదులకు ఆహారం-నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ దోషం తగ్గుతుందంటారు. 

Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు

Also Read: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి

Published at : 22 Apr 2022 09:14 AM (IST) Tags: Ardhastama Shani Shani elinati shani elinati shani remedies in telugu ashtama shani elinati shani effect remedies for ashtama shani and elinati shani ashtama shani remedies elinati shani effects and remedies in telugu

సంబంధిత కథనాలు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు

Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!

Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!