Today Panchang 6th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఆర్థిక బాధలు తొలగించే శ్లోకం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్యపూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...
మే 6 శుక్రవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 06- 05 - 2022
వారం: శుక్రవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం
తిథి : పంచమి శుక్రవారం ఉదయం 9.01 వరకు తదుపరి షష్టి
వారం : శుక్రవారం
నక్షత్రం: ఆరుద్ర ఉదయం 6.24 తదుపరి పునర్వసు
వర్జ్యం : రాత్రి 7.40 నుంచి 9.26
దుర్ముహూర్తం : ఉదయం 8.08 నుంచి 8.59 తిరిగి మధ్యాహ్నం 12.22 నుంచి 1.13 వరకు
అమృతఘడియలు : లేవు
సూర్యోదయం: 05:36
సూర్యాస్తమయం : 06:17
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: శ్రీ చక్రం ఎంత పవర్ ఫులో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది
శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందులోనూ శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఐశ్వర్యం ప్రాప్తి ఉంటుందని... ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు.
మహాలక్ష్మి అష్టకం
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తు తే ‖
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ‖
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ‖
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ‖
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ‖
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ‖
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ‖
ముఖ్యంగా శుక్రవారం ఈ శ్లోకాన్ని కనీసం 3 సార్లు పారాయణం చేస్తే దారిద్య్ర బాధలు తగ్గుతాయని పండితులు చెబుతారు
Also Read: ఆదిశంకరాచార్యులు ఎవరు, హిందూమత ఉద్ధరణ కోసం ఏం చేశారు
Also Read: ఇంట్లో కనక వర్షం కురిపించే స్తోత్రం, నిత్యం చదివితే ఆర్థిక సమస్యలే ఉండవు