Today Panchang 11th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, విఘ్నాలు తొలగించే వినాయకుడి శ్లోకం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...

FOLLOW US: 

మే 11 బుధవారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 11- 05 - 2022
వారం: బుధవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం

తిథి  :  దశమి బుధవారం మధ్యాహ్నం 3.24 వరకు తదుపరి ఏకాదశి
వారం : బుధవారం 
నక్షత్రం: పుబ్బ మధ్యాహ్నం 3.55 తదుపరి ఉత్తర  
వర్జ్యం :  రాత్రి 11.16 నుంచి 12.54  
దుర్ముహూర్తం :  ఉదయం 11.31 నుంచి 12.22 
అమృతఘడియలు :  ఉదయం 9.14 నుంచి 10.54
సూర్యోదయం: 05:33
సూర్యాస్తమయం : 06:12

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతుంది, మీకు ధైర్యం ఉందా

బుధవారం గణపతికి, అయ్యప్పస్వామికి ప్రీతికరమైన రోజు. శ్రీ మహావిష్ణువుని కూడా కొందరు ఇదే రోజు ఆరాధిస్తారు. ఎవరి భక్తి వాళ్లది.అయితే ప్రధమ పూజచేసే గణపయ్య శ్లోకాలు నిత్యం చదువుకుంటే విఘ్నాలు తొలగి విజయాలు సాధిస్తామని విశ్వసిస్తారు. 

వినాయకుడి శ్లోకాలు

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే||

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే||

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||

మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర|
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే||

గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం||

సుముఖశ్చై కదందశ్చ కపిరో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః|
ధూమకేతు నరాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః||

విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాననాయ శృతియజ్ఞ – విభూషితాయ
గౌరీ సుతాయ గణనాథ నమో నమస్తే ||

తొండమునేక దంతము తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలున్ మెల్లని చూపుల మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్..

గణేశ గాయత్రి
ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి 
తన్నోదంతిః ప్రచోదయాత్

Also Read:మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు

Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు

Published at : 11 May 2022 05:31 AM (IST) Tags: Day nakshtra thidi rahukal varjyam durmuhurtram friday Today Panchang May 11th Today Panchang may 11

సంబంధిత కథనాలు

TTD Special Darshanam Tickets: వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ గుడ్‌న్యూస్ - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

TTD Special Darshanam Tickets: వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ గుడ్‌న్యూస్ - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి

Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి

Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు

Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు

Astrology: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

Astrology: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత

Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు