Ujjain: ఉజ్జయిని వెళ్తున్నారా? ఈ ఐదు దేవాలయాలను సందర్శిస్తే కోరికలు నెరవేరుతాయట
Ujjain: భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఉజ్జయిని అత్యంత పవిత్రమైన ప్రదేశాలకు నిలయంగా ఉంది. వాస్తు శిల్పం, చరిత్ర లేదా ఆధ్యాత్మికతను అస్వాదించే వారు ఉజ్జయిని వెళ్తే ఈ 5 ఆలయాలు సందర్శించండి.
Ujjain: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని. దీనిని బాబా మహాకల్ నగరం కూడా పిలుస్తుంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. బాబా మహాకాల్ దక్షిణం వైపున ఉన్న జ్యోతిర్లింగం ఉజ్జయినిలో ఉంది. మహాకాళేశ్వర్ కాకుండా ఉజ్జయినిలో ఇతర ప్రసిద్ధ దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిని సందర్శిస్తే ఒక వ్యక్తి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. భారతదేశం ప్రసిద్ధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, ఇతర పర్యాటక కేంద్రాలకు నిలయంగా ఉంది. ఆధ్యాత్మిక అనుభూతి కోసం భక్తులు జీవితంలో ఒక్కసారైనా తప్పక సందర్శించాల్సిన ఉజ్జయినిలో కొన్ని ముఖ్యమైన ఆలయాలను చూద్దాం.
మహాకాలేశ్వర్ ఆలయం:
ఉజ్జయినిలో ఉన్న అత్యంత పవిత్రమైన హిందూ ఆలయం బాబా మహాకాల్. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయం చుట్టూ పెద్ద రుద్రసాగర్ సరస్సు ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భోలేనాథ్ స్వామికి ప్రతిరోజూ పలు రకాల అలంకారాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఉజ్జయినిలో బ్రహ్మ ముహుర్తంలో నిర్వహించే మహాదేవుని భస్మ హారతి అత్యంత విశిష్టమైదిగా పరిగణిస్తుంటారు.
చింతామన్ గణేశ్ ఆలయం:
చింతామన్ గణేశ్ ఆలయం ఉజ్జయినిలో ఉన్న పురాతన ఆలయాల్లో ఒకటి. చింతామన్ గణేష్ ఆలయం ఫతేహాబాద్ రైలు మార్గంలో షిప్రా నదికి సమీపంలో ఉంది. ఇది గణేశ విగ్రహానికి నిలయం. ఇక్కడున్న అతిపెద్ద విగ్రహం నుంచి ఉద్భవించిందని భావిస్తారు. మతపరంగా చాలా ముఖ్యమైంది. అక్కడి దేవతను చింతాహరన్ గణేష్ అని పిలుస్తుంటారు. ప్రాపంచిక ఆందోళనల నుంచి విముక్తి కల్పించేవాడు అని చెబుతుంటారు. ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.
రామ్ ఘాట్:
ఉజ్జయినిలో ఎక్కువ మంది సందర్శించే పవిత్ర ప్రదేశాల్లో రామ్ ఘాట్ ఒకటి. ఎందుకంటే రాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఘాట్ లోని స్నానమాచరించేవారని చెబుతుంటారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళ నాలుగు ప్రదేశాల్లో ఈ ఘాట్ ఒకటి. భక్తులు తమ నిత్య కర్మలను ఆచరించి రోజూ నదీస్నానం చేయడం వల్ల మోక్షాన్ని పొంది బాధలు, సమస్యలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.
ద్వారికాధీష్ గోపాల్ మందిర్:
ఉజ్జయినిలో 19వ శతాబ్దపు తొలి మరాఠా దేవాలయం. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. ఇది మరాఠా నిర్మాణానికి అద్బుతమైన ఊదాహరణ అని చెప్పవచ్చు. ఈ మందిరం వెండి పూతతో తయారు చేసిన తలపులు పాలరాతి పొదిగిన బలిపీఠ్ం పై రెండు అడుగుల ఎత్తైన కృష్ణుడి బొమ్మతో పాలరాతితో నిర్మించి ఉంది. నగరం మధ్యలో ఈ ఆలయం ఉంది. మరాఠా రాజు దౌలత్రావ్ షిండే భార్య బయాజీ షిండే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ మందిరంలో గరుడ, పార్వతి, శివుడి విగ్రహాలు ఉన్నాయి.
కాలభైరవ ఆలయం:
ఉజ్జయినిలోని ప్రసిద్ధ దేవాలయంలో కాల భైరవుని ఆలయం కూడా ఉంది. కాల భైరవుడు శివుని ఉగ్రరూపంగా పరిగణిస్తారు. ఈ గ్రంథాల ప్రకారం కాల భైరవుడు తంత్ర శాఖతో సంబంధం ఉంది. మహా శివరాత్రి నాడు కాలభైరవ ఆలయాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలివస్తుంటారు.
Also Read : కొత్తగా పెళ్లయ్యిందా? మీ బెడ్ రూమ్‌ను ఇలా అలంకరించుకుంటే.. సుఖం, సంపద!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.