అన్వేషించండి

Vastu Tips: కొత్తగా పెళ్లయ్యిందా? మీ బెడ్ రూమ్‌ను ఇలా అలంకరించుకుంటే.. సుఖం, సంపద!

కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నా, కొత్త ఫర్నిచర్ ఇంట్లోకి తెచ్చుకుంటున్నా లేక కొత్తగా పెళ్లయిన జంటను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటించడం అవసరం.

నూతన దంపతులు కొత్త జీవితం ప్రారంభిస్తున్నపుడు వారి ఆనందకర జీవితం కోసం అందరూ శుభాకాంక్షలు చెబుతారు. వారి దాంపత్యం కలకాలం ఆనందంగా సాగాలంటే వారు కాపురం చెయ్యబోయే ఇంట్లోని వాస్తు కూడా అందుకు అనుకూలంగా ఉండాలి. కొత్త దంపతుల బెడ్ రూమ్ కోసం కొన్ని వాస్తు నియమాలు తెలుసుకుందాం.

చాలా కుటుంబాలు వాస్తు నియమాలను అనుసరించి వారి ఇంటికి తగిన ఏర్పాట్లు, మార్పులు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లోకి కొత్త కోడలు వస్తున్నపుడు తనకు స్వాగతం పలుకుతూ కొత్త దంపతుల కోసం గది ఏర్పాటు చెయ్యడం పరిపాటి.

  • కొత్త దంపతుల కోసం ఏర్పాటు చేసే గది వాస్తును అనుసరించి నైరుతిలో ఉండాలి. ఈ దిశలో దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరిగేందుకు, వారి మధ్య సఖ్యతకు అనుకూలంగా ఉంటుంది. ఈశాన్యంలో నవదంపతుల పడక గది ఏర్పాటు చెయ్యకూడదు.
  • కొత్తగా పెళ్లయిన వారు తమ పెళ్లి సమయంలో తీసుకున్న ఫోటోలను గదిలో అలంకరించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి ఫోటోలను గదిలోని తూర్పు దిక్కు గోడ మీద అలంకరించుకోవచ్చు. ఇది వారి మధ్య సామరస్యానికి కారణం అవుతుంది.
  • వాస్తును అనుసరించి మంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పడుకున్నపుడు దక్షిణం వైపు తల ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. నలుపు , బ్రౌన్, గ్రే  క్రీమ్ కలర్స్ లో వాల్ పేపర్లు పెట్టుకోవద్దు.
  • బెడ్ షీట్లు, దుప్పట్లు, పిల్లో కవర్లు కూడా ఈ రంగులవి ఉపయోగించకపోవడమే మంచిది. పసుపు, లేత నీలం, పసుపు, గులాబి రంగు, ఆరెంజ్ రంగుల్లో వాల్ పేపర్స్ నుంచి బేడ్ షీట్లు, దుప్పట్లు ఉపయోగించాలి. మంచం ప్రతిబింబం కనిపించే విధంగా అద్దం ఏర్పాటు చేసుకోవద్దు. అద్దం ఇలా ఉంటే ఆరోగ్యానికి హాని చేస్తుంది.
  • బెడ్ రూమ్ ఎప్పుడూ శుభ్రంగా చెత్త పేరుకోకుండా ఉండాలి. పనికి రాని వస్తువులు ఎప్పుడూ బెడ్ రూమ్ లో ఉంచకూడదు. వాస్తును అనుసరించి పని చేసుకునే వస్తువులు కూడా బెడ్ రూమ్ లో ఉండకూడదు. అంటే లాప్ టాప్, కంప్యూటర్, చార్జర్లు ఇతర గాడ్జెట్ సామాగ్రి బెడ్ రూమ్ లో ఏర్పాటు చేసుకోవద్దు. ఇవి కొత్తగా పెళ్లయిన వారి మధ్య దూరానికి కారణం అవుతాయి. కనుక వీలైనంత వరకు పనిచేసుకునే సాధనాలు, పని విషయాలను బెడ్ రూమ్ లోకి తీసుకురాకూడదని వాస్తు సూచిస్తోంది.
  • బెడ్ రూమ్ లో ఏర్పాటు చేసుకునే ఫర్నీచర్ ఎప్పుడూ చెక్కతో చేసినవైతే మంచిది. వీటి నుంచి వచ్చే ఎనర్జీ వెచ్చగా సౌకర్యంగా ఉంటుంది. మెటల్ తో చేసిన ఫర్నిచర్ నుంచి వచ్చే ఎనర్జీ చల్లగా ఉండడం వల్ల అంత మంచిది కాదు. మంచం మీద ఉఫయోగించే మ్యాట్రెస్ ఎప్పుడూ సింగిల్ అయితే ఇద్దరి మధ్య సఖ్యతకు దోహదం చేస్తుంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు. 

Also Read : పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, బీసీ రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై చర్చలు
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, బీసీ రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై చర్చలు
Pawan Kalyan: కూటమి అంటే ఓ కుటుంబం, ఆయన మాటలు మా అందరికీ ఆదర్శం: వైసీపికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
కూటమి అంటే ఓ కుటుంబం, ఆయన మాటలు మా అందరికీ ఆదర్శం: వైసీపికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
Mazaka Twitter Review: మజాకా ట్విట్టర్ రివ్యూ: సందీప్ కిషన్, రావు రమేష్ కామెడీతో అదరగొట్టేశారుగా.. మరి హిట్టేనా.. నెటిజన్లు ఏమంటున్నారంటే.?
మజాకా ట్విట్టర్ రివ్యూ: సందీప్ కిషన్, రావు రమేష్ కామెడీతో అదరగొట్టేశారుగా.. మరి హిట్టేనా.. నెటిజన్లు ఏమంటున్నారంటే.?
House Prices In Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు - దేశ రాజధానితో పోలిస్తే భాగ్యనగరం చాలా బెటర్‌
హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు - దేశ రాజధానితో పోలిస్తే భాగ్యనగరం చాలా బెటర్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GV Reddy Resign Controversy | GV రెడ్డి రాజీనామాతోనైనా చంద్రబాబులో మార్పు వస్తుందా.? | ABP DesamAP Deputy CM Pawan Kalyan Speech | మొఘలులు ఓడించారనేది మన చరిత్ర అయిపోయింది | ABP DesamPastor Ajay Babu Sensational Interview | యేసును తిడుతున్నారు..అందుకే హిందువులపై మాట్లాడుతున్నాం |ABPAdani Speech Advantage Assam 2.0 | అడ్వాంటేజ్ అసోం 2.0 సమ్మిట్ లో అదానీ సంచలన ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, బీసీ రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై చర్చలు
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, బీసీ రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై చర్చలు
Pawan Kalyan: కూటమి అంటే ఓ కుటుంబం, ఆయన మాటలు మా అందరికీ ఆదర్శం: వైసీపికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
కూటమి అంటే ఓ కుటుంబం, ఆయన మాటలు మా అందరికీ ఆదర్శం: వైసీపికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
Mazaka Twitter Review: మజాకా ట్విట్టర్ రివ్యూ: సందీప్ కిషన్, రావు రమేష్ కామెడీతో అదరగొట్టేశారుగా.. మరి హిట్టేనా.. నెటిజన్లు ఏమంటున్నారంటే.?
మజాకా ట్విట్టర్ రివ్యూ: సందీప్ కిషన్, రావు రమేష్ కామెడీతో అదరగొట్టేశారుగా.. మరి హిట్టేనా.. నెటిజన్లు ఏమంటున్నారంటే.?
House Prices In Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు - దేశ రాజధానితో పోలిస్తే భాగ్యనగరం చాలా బెటర్‌
హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు - దేశ రాజధానితో పోలిస్తే భాగ్యనగరం చాలా బెటర్‌
Crime News: మహాశివరాత్రి విషాదాలు.. స్నానానికి గోదావరిలో దిగి ఐదుగురు యువకులు గల్లంతు
మహాశివరాత్రి విషాదాలు.. స్నానానికి గోదావరిలో దిగి ఐదుగురు యువకులు గల్లంతు
Maha Shivaratri Wishes : మహా శివరాత్రి శుభాకాంక్షలు.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో ఈ ఫోటోలు షేర్ చేసి, ఈ మెసేజ్​లతో విషెష్ చెప్పేయండి
మహా శివరాత్రి శుభాకాంక్షలు.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో ఈ ఫోటోలు షేర్ చేసి, ఈ మెసేజ్​లతో విషెష్ చెప్పేయండి
MahaKumbhs Final Snan: కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్యస్నానాలు
కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్యస్నానాలు
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు
ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు
Embed widget