అన్వేషించండి

Period Pregnancy Chances : పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?

Period Pregnancy : పీరియడ్స్ సమయంలో శారీరకంగా కలవొచ్చా అని కొందరు ఆలోచిస్తుంటే.. పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయవచ్చా అని మరికొదంరు ఆలోచిస్తున్నారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. 

Chances of Pregnancy in Periods : పీరియడ్స్ సమయంలో కొన్ని కారణాల వల్ల కొందరు లైంగికంగా యాక్టివ్​గా ఉంటారు. ఇలా చేయడం సురక్షితమేనా అంటే.. అసలు పీరియడ్స్ సమయంలో ఆ యాక్టివిటీ చేయొచ్చా అంటే.. కచ్చితంగా దానికి ఎస్ చెప్తున్నారు నిపుణులు. ఋతుస్రావం సమయంలో లైంగికంగా పాల్గొనడం పూర్తిగా సురక్షితమేనని చెప్తున్నారు. కానీ పరిశుభ్రత, ఆరోగ్య సమస్యలు వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో కలవడం ప్రెగ్నెంట్ అవుతారా? మరికొందరు పీరియడ్స్ సమయంలో లైంగికంగా ఉండడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు. ఇది నిజమేనా? 

ఆ సమయంలో ప్రెగ్నెంట్ అవుతారా? 

కొందరు పరిశోధకులు ఇదే అంశంపై అధ్యయనం చేసి.. పీరియడ్స్ సమయంలో లైంగికంగా పాల్గొనడం ద్వారా గర్భవతి అయ్యే అవకాశం లేదని వెల్లడించింది. ఎందుకంటే స్పెర్మ్(Sperm Cell) సెల్.. మహిళలోని గుడ్డు కణాన్ని కలిసి ఫలదీకరణం చెంది.. ప్రెగ్నెంట్ అవుతారు. కానీ ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు స్పెర్మ్ కలిసినా.. ఎగ్ ఉండదు కాబట్టి గర్భం దాల్చలేరు. ఎగ్ రిలీజ్ అయిన వారం తర్వాత మరో ఎగ్ ఫామ్ అయి.. ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు పెంచుతుంది. కానీ కొందరిలో అది జరగవచ్చని కూడా తెలిపారు నిపుణులు. పీరియడ్స్ సమయంలో మరో ఎగ్ రెడీ అవ్వడం లేదా.. పీరియడ్ నాల్గోవ రోజును కూడా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవారికి కరెక్ట్ విండో అని దానివల్ల కూడా కొందరిలో ప్రెగ్నెంట్ అయ్యే అవకాశముందని తెలిపారు. కానీ ఇది రేర్ కేస్​లలో మాత్రమే జరుగుతుంది. 

స్పెర్మ్ మనుగడపై డిపెండ్ అయి ఉంటుంది..

అండోత్సర్గము జరిగిన సమయంలో సమయంలో విడుదలైన గుడ్డును స్పెర్మ్ ఫలదీకరణం చేసినప్పుడు గర్భం రావొచ్చు. ఈ అండోత్సర్గం అనేది స్త్రీ ఋతుచక్రం(Menstrual Cycle) మధ్యలో విడుదల అవుతుంది. కొంతమంది స్త్రీలకు ఇది నెల ఉంటే.. మరికొందరికి ఎక్కువ లేదా తక్కువ రోజులలో ఇది జరుగుతూ ఉంటుంది. అందుకే పీరియడ్స్ రెగ్యూలర్​గా వస్తున్నాయో లేదో చూసుకోవాలి అంటారు. అలా పీరియడ్ సైకిల్ ముగిసే సరికి అండోత్సర్గము విడుదలకావడం వల్ల.. పీరియడ్స్​లో లైంగికంగా కలిసిన ప్రెగ్నెంట్ అయ్యే అవకాశముంటుంది. ఈ అవకాశం మహిళలో ఉన్నా.. స్పెర్మ్ మనుగడ కూడా కరెక్ట్​గా ఉండాలి. పీరియడ్స్ సమయంలో స్పెర్మ్ లోపలికి వెళ్లగలిగినప్పుడే ఎగ్ అనేది ఫలదీకరణం చెంది ప్రెగ్నెంట్ అవుతారు. లేకుంటే కష్టమే. 

వీటిని దృష్టిలో ఉంచుకోవాలి..

ఋతుస్రావం సమయంలో ప్రెగ్నెంట్​ అయ్యేందుకు.. పీరియడ్ సైకిల్, స్పెర్మ్ మనుగడ, ఇర్​రెగ్యూలర్ పీరియడ్స్​ వంటివి కారణాలు అవుతాయి. కానీ ఇవి రేర్​ కేస్​లలో మాత్రమే జరుగుతాయనేది గుర్తించుకోవాలి. అయితే పీరియడ్స్ సమయంలో కలవడం కంటే.. తర్వాతనే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకుంటే మంచిదంటున్నారు. ఎందుకంటే పీరియడ్స్ సమయంలో ఇన్​ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు లైంగికంగా కలవాలి అనిపిస్తే నిరోధ్​లు ఉపయోగించవచ్చని.. దీనివల్ల లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు వ్యాపించవని చెప్తున్నారు. వీటిని మగవారే కాదు.. పీరియడ్స్ సమయంలో ఆడవారు కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల మీకు, మీ భాగస్వామికి ఇబ్బందులు ఉండవంటున్నారు నిపుణులు. 

Also Read : ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd Test Highlights: 24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - కివీస్ విజయభేరి
24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
RRR Movie : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
Investment Idea: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి, డ్రోన్లతో వరుసగా దాడులు!‘సుప్రీం జడ్జినే చంపేశారు, చేతకాని పాలకుడు చెత్తపన్ను వేశాడు’వీడియో: చంద్రబాబుకు ముద్దు పెట్టాలని మహిళ ఉత్సాహంParvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd Test Highlights: 24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - కివీస్ విజయభేరి
24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
RRR Movie : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
Investment Idea: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Kurnool News: ‘డెలివరీ కోసం వెళితే ప్రాణం తీశారు’ - హాస్పిటల్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన
‘డెలివరీ కోసం వెళితే ప్రాణం తీశారు’ - హాస్పిటల్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన
Embed widget