పీరియడ్ క్రాంప్స్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోండిలా పీరియడ్స్ సమయంలో చాలామంది నొప్పి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. హీట్ ప్యాక్ పెట్టుకోవడం, వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల క్రాంప్స్ నుంచి ఉపశమనం ఉంటుంది. రెగ్యూలర్గా వ్యాయామం చేస్తే పెయిన్ క్రమంగా తగ్గుతుంది. అల్లం, పుదీనా వంటి హెర్బల్ టీలు కూడా నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కలిగిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మంచిది. మెగ్నీషియం సప్లిమెంట్స్ కూడా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Envato)