వేసవిలో దొరికే ఆరోగ్యకరమైన కూరగాయ బీరకాయ. చాలా మందికి ఇది ఇష్టం ఉండదు. బీరకాయలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు కూడా ఉంటాయి. బీరకాయలో విటమిన్లు A, C, B కాంప్లెక్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా పుష్కలం. బీరకాయలో పైబర్, నీరు ఎక్కువ కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీరకాయలో క్యాలరీలు కూడా చాలా తక్కువ. కనుక సులభంగా బరువు తగ్గవచ్చు, బీరకాయ గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. పైబర్ ఎక్కువ కనుక మధుమేహులకు మంచి ఆహారం. బీరకాయతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది కనుక గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీరకాయలో విటమిన్ A ఉంటుంది. కనుక కంటి ఆరోగ్యానికి మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.