పుచ్చకాయలను అతిగా తింటున్నారా? జరిగేది ఇదే!

పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని, దీనితో ఎలాంటి నష్టం ఉండదనుకుంటున్నారా?

పుచ్చకాయ మోతాదుకు మించి తీసుకున్నపుడు కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. కడుపుబ్బరం, గ్యాస్, విరేచనాలు కూడా కావచ్చు.

మధుమేహులు పుచ్చకాయ ఎక్కువగా తిన్నపుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

పుచ్చకాయ అధికంగా తీసుకుంటే లైకోపినేమియా అనే చర్మ సమస్య రావచ్చట.

ఆల్కహాలిక్స్ పుచ్చపండు ఎక్కువ తీసుకుంటే.. ఇందులోని లైకోపిన్ వల్ల కాలేయం మీద మరింత భారం పడుతుంది.

పుచ్చకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె పనితీరు మీద ప్రభావం చూపడం వల్ల గుండె లయ తప్పవచ్చు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.