యాంటీఆక్సిడెంట్లతో తేనె మంచి పౌష్టిక ఆహారం. తేనె శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడుతుంది. తేనెకు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇది ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. తేనె శారీరక శక్తిని పెంచుతుంది. వేసవిలో వర్కవుట్ కి ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దగ్గు, గొంతు నొప్పి తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే అలర్జీలకు మంచి పరిష్కారం. జీర్ణక్రియ సజావుగా జరిగేందుకు తేనె బాగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు దోహదం చేస్తుంది. తేనె క్రమం తప్పకుండా తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారు. ఈ సమాచారం కేవలం కేవలం అవగాహన కోసం మాత్రమే.