శరీరంలో ప్యూరిన్ల బ్రేక్ అవుట్ తో యూరిక్ ఆసిడ్ తయారవుతుంది.

యూరిక్ యాసిడ్ ఎక్కువగా కలిగిన రోగులు ప్యూరిన్లు కలిగిన ఆహారం మీద దృష్టిపెట్టాలి.

కాలీఫ్లవర్, ఆస్పరాగస్, బఠాణీ, పుట్టగొడుగుల వంటి యూరిక్ యాసిడ్ ఎక్కువ కలిగిన ఆహారం తీసుకోవద్దు.

పండ్లరసాలు, చక్కెర ఎక్కువ కలిగిన సోడా డ్రింక్స్ తీసుకోవద్దు. వీటి వల్ల గౌట్ సమస్య రావచ్చు.

వీలైనంత వరకు మాంసాహారం తీసుకోవద్దు. వీటివల్ల శరీరంలో యూరికాసిడ్ పెరుగుతుంది.

ప్యూరిన్లు ఎక్కువగా ఉండే చిక్కుళ్లు, పప్పుధాన్యాలు మోతాదులో తీసుకోవాలి.

కేకులు, కుకీలు, బ్రెడ్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు కలిగిన పదార్థాలు తీసుకుంటే యూరికాసిడ్ పెరుగుతుంది.

ఆల్కాహాల్ తో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. కనుక ఆల్కహాల్ కలిగిన పానీయాలను చాలా తక్కువగా వినియోగించాలి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే