బొప్పాయి జీర్ణక్రియ సజావుగా సాగేందుకు దోహదం చేస్తుంది. జీవక్రియలను వేగవంతం చెయ్యడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. పియర్స్ లో ఫైబర్ ఎక్కువ. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బలబద్దకాన్ని నివారిస్తుంది. ఉదయాన్నే కివి పండు తీసుకుంటే అదనపు క్యాలరీ కరిగిపోతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా కలిగిన అవకాడో బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తుంది. జామలో విటమిన్లు, మినరల్స్ పుష్కలం. దీనిలో ఉండే ఫైబర్ వల్ల అదనపు క్యాలరీలు కూడా ఖర్చవుతాయి. ఆపిల్ బరువు తగ్గించే సంప్రదాయ పండుగా చెప్పుకోవచ్చు. వీటిలో ఫైబర్ ఎక్కువ.. క్యాలరీలు తక్కువ. స్వీట్ క్రేవింగ్స్ తగ్గించడమే కాదు బెర్రీలు తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండి క్యాలరీ ఇన్ టేక్ తగ్గుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.