News
News
X

భగవద్గీత ఓ మత గ్రంధం మాత్రమే కాదు జీవిత సత్యాన్ని బోధించే వ్యక్తిత్వ వికాసం  

భగవద్గీత అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రం. వాస్తవానికి భగవద్గీత పూజించడానికో, పఠించడానికో నిర్దేశించింది కాదు.. మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించిన గ్రంధం.

FOLLOW US: 

భగవద్గీత వింటే వైరాగ్యం కాదు
భగవద్గీత శ్లోకాలు వినిపించగానే..అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు అందుకే భగవద్గీత పెట్టారనే వారి సంఖ్య ఎక్కువే.  కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు వినే గ్రంధంగా మైండ్ ట్యూన్ అయిందంటే తప్పెక్కడుంది. భగవద్గీత వింటున్నా అని ఎవరైనా చెప్పినప్పుడు ఎందుకంత వైరాగ్యం అంటారు. వాస్తవానికి భగవద్గీత అంటే వైరాగ్యం కాదు చేయాల్సిన కార్యాన్ని గుర్తుచేస్తూ కర్తవ్య నిర్వహణను  సూచించే ప్రేరకం. భగవద్గీత అంటే జీవిత చరమాంకంలో కాలక్షేపం కోసం చదివే పుస్తకం కాదు... రకరకాల ఉద్రేకాల మధ్య కొట్టుకుపోతున్న యువత వాటినుంచి ఎలా బయటపడాలో చెప్పే గ్రంధం. జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది.  ఎదురయ్యే ప్రతిప్రశ్నకీ సమాధానం ఇస్తుంది. సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం వికలమై.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత.

Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4

కర్తవ్యం వైపు మళ్లించడమే గీత లక్ష్యం
మహాభారతంలో  భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలు భగవద్గీతగా చెబుతారు. ఒక అధ్యాయాన్ని ఒక యోగం అంటారు. ఆరు యోగాలని కలిపి ఒక షట్కమంటారు. 1 నుంచి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుంచి 12 వరకు భక్తి షట్కమని, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కమని అంటారు. మహా భారతంలో భగవద్గీత ఒక భాగమైనా, భగవద్గీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క భగవద్గీత ఎన్నో పురాణేతిహాసాలకు సమానం. అంటే అన్నీ ఇతిహాసాలు చదవనక్కరలేదు ఒక్క భగవద్గీత చదివితే చాలు, జీవిత పరమార్ధం తెలుస్తుంది. కర్తవ్య విముఖుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యం వైపు మళ్ళించడమే గీత లక్ష్యం. 

శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యాయంలోనే స్పష్టం చేశాడు. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప’- క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని హెచ్చరించాడు. ఈ హృదయమే అన్ని ఆలోచనలకూ, రాగద్వేషాలకు కేంద్రం. బుద్ధిస్థితిలో ఆలోచన ఉంటుంది. తర్కం పనిచేస్తుంది. హృదయం దగ్గరికి వచ్చేసరికి భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు వేయకుండా కళ్లెం వేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాతే బోధ ప్రారంభించాడు. 

Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2

మనచుట్టూ ఆవహించిన మాయను తొలగించిమని చెప్పిన భగవద్గీత
గీతోపదేశంలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి చెప్పలేదు. వాటిని ఎలా సంధించాలో వివరించలేదు. యుద్ధ వ్యూహాలు నేర్పించలేదు. శత్రువులను సంహరించే మెలకువలనూ నేర్పలేదు. ఈ విషయాలన్నింటిలో తనకు తానే సాటి అయిన అర్జునుడిని ఆవహించిన మాయను తొలగించి రణరంగంలోకి దిగేలా బోధించాడు. 
‘నీకు నిర్దేశించిన కర్మలను నువ్వు చేయడమే సరైనది. దేనినీ చేయకపోవడం కన్నా నీ ధర్మాన్ని అనుసరించి పని చేయడమే ఉత్తమం. ఏ పనీ చేయకుండా ఉంటే శరీర నిర్వహణ కూడా ముందుకు కొనసాగదు’. 
‘అర్జునా! యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. గెలిస్తే రాజ్యలక్ష్మి సిద్ధిస్తుంది. ఏదైనా ప్రయోజనమే, కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవ్వు’ అని పార్థుడికి బోధించాడు  శ్రీకృష్ణుడు.  
చెప్పడం వరకే ఆయన పని, చెప్పింది శ్రద్ధగా విన్నాడు. విన్నది అర్థం చేసుకున్నాడు, అర్థమైన దాన్ని అర్థవంతంగా ఆచరించి తన కర్తవ్యాన్నినిర్వర్తించాడు అర్జునుడు.  

ఇంకా చెప్పుకుంటూ వెళితే భగవద్గీత గురించి చెప్పడానికి మాటలు సరిపోవు..అందుకే అంటారు..భగవద్గీత ఓ మతానికి  సంబంధించిన గ్రంధం కాదు జీవిత సత్యాన్ని బోధించే వ్యక్తిత్వ వికాసం.  

Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3

Published at : 19 Aug 2022 10:35 AM (IST) Tags: bhagavad gita motivation bhagavad gita telugu bhagavad gita lessons bhagavad gita meaning the bhagavad gita summary bhagavad gita significance importance and significance of bhagavad gita

సంబంధిత కథనాలు

Horoscope Today 4th  October 2022:  ఈ రాశులవారికి విజయం, అభయం - అక్టోబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th October 2022: ఈ రాశులవారికి విజయం, అభయం - అక్టోబరు 4 రాశిఫలాలు

Dussehra 2022: నవరాత్రుల్లో ఆఖరి రోజు సకలసిద్ధులనూ ప్రసాదించే సిద్దిధాత్రి దుర్గ

Dussehra 2022: నవరాత్రుల్లో ఆఖరి రోజు సకలసిద్ధులనూ ప్రసాదించే సిద్దిధాత్రి దుర్గ

Minister Indrakaran Reddy : పురాతన ఆలయాలకు పూర్వ వైభవం, రూ.10 కోట్లతో అడెల్లి పోచమ్మ ఆలయం పునర్నిర్మాణం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister Indrakaran Reddy : పురాతన ఆలయాలకు పూర్వ వైభవం, రూ.10 కోట్లతో అడెల్లి పోచమ్మ ఆలయం పునర్నిర్మాణం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

ఈ రాశులవారిని అంతా ఇష్టపడతారు, ఇందులో మీ రాశి ఉందా?

శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజు - మహిషాసుర మర్థినిగా అమ్మవారి దర్శనం

శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజు - మహిషాసుర మర్థినిగా అమ్మవారి దర్శనం

టాప్ స్టోరీస్

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!

Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!