(Source: ECI/ABP News/ABP Majha)
Spirituality: మీ చేత్తో ఎవ్వరికీ ఇవ్వకూడని వస్తువులు ఇవే!
కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వీటిని పట్టించుకోని వారి మాటేమో కానీ పాటించేవారు మాత్రం తూచ తప్పకుండా ఫాలో అవుతారు. అలాంటి సెంటిమెంట్స్ కొన్ని మీకోసం...
Spirituality: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేయని ప్రయత్నాలుండవు. ఆర్థిక సమస్యలు తీరి, ఆదాయం పెరుగుతుందంటే ఏ నియమాలైనా పాటించేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు కానీ రోజువారీ జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. తెలిసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెడతాయంటారు. ముఖ్యంగా కొన్ని వస్తువులను పొరపాటున కూడా చేతికి అందించకూడదని చెబుతారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. అలా చేస్తే మహాలక్ష్మీదేవి ఆశీర్వచనాలు పొందలేరని నమ్ముతారు. పైగా ఈ ప్రభావం మీ అర్థిక స్థితిపై పడుతుందంటారు. ఆ వస్తువులేంటో చూద్దాం...
Also Read: రోడ్డుపై వీటిని తొక్కేస్తున్నారా - ఏం జరుగుతుందో తెలుసా!
మిరపకాయలు
ఏ వ్యక్తి చేతికి నేరుగా కారం ఇవ్వకూడదు. ఎవరైనా ఇలా చేస్తే ఆ వ్యక్తితోనే గొడవలు మొదలవుతాయని అంటున్నారు. అందుకే కారం, మిరపకాయలు లాంటివి ఎప్పుడూ ఒకరి చేతికి అందించకూడదు.
ఉప్పు
ఉప్పు లక్ష్మీ స్వరూపం అని చెబుతారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటూ ఉప్పు కూడా ఉద్భవించిందని చెబుతారు. అందుకే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునేందుకు ఉప్పుతో చాలా రెమిడీస్ చెబుతారు. ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఒక గాజు పాత్రలో పిడికెడు ఉప్పు వేసి అందులో నాలుగైదు లవంగాలు కూర్చి ఇంట్లో ఈశాన్యం మూలన ఉంచాలంటారు. ప్రతి శుక్రవారం ఉప్పుతో దీపం వెలిగిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీటిలో ఉప్పువేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పురాణాల ప్రకారం ఐశ్వర్యం పెరగాలన్నా, శని ప్రభావం తగ్గాలన్నా ఉప్పే పరిష్కారం. అందుకే ఉప్పును చేతికి ఇవ్వకూడదని చెబుతారు పండితులు.
Also Read: ఇళ్లు, షాపుల ఎంట్రన్స్ లో నిమ్మకాయ, మిరపకాయ ఎందుకు కడతారు
కశ్చీఫ్
కశ్చీఫ్ కావాలని అడగ్గానే ఠక్కున తీసి చేతికందిస్తారు. కానీ రుమాలు ఎప్పుడూ చేతికి అందించకూడదంటారు పండితులు. ఇవ్వాలి అనుకుంటే అక్కడ పెట్టి తీసుకోమని చెప్పండి కానీ నేరుగా చేతికి ఇవ్వొద్దంటారు. అలా కశ్చీఫ్ చేతికిస్తే మాత్రం ఆర్థికంగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు పండితులు
రొట్టెలు
సాధారణంగా రొట్టెలు తినేటప్పుడు పక్కవాళ్లు కావాలని అడగ్గానే చాలామంది ప్లేట్లో వడ్డిస్తారు. కొందరు మాత్రం రొట్టే కదా అంటుకోదు కదా అని చేతికి అందిస్తారు. కానీ రొట్టెలు ఎప్పుడూ ప్లేట్లో వడ్డించాలి కానీ చేతికి ఇవ్వకూడదంటారు.
లక్ష్మీ కటాక్షం కోసం పఠించాల్సినవి
ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ:
ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి
ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ:
ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ వృద్ధి చెందుతారు
ఓం శ్రీం శ్రీ అయే నమ:
ఈ మంత్రాన్ని పలకడం వల్ల సంతోషంగా ఉంటారు
ఓం మహాదేవ్యేచ విద్మహే విష్ణు పత్నేచ దీమహే...
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
లక్ష్మీ గాయత్రి మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు
ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ:
ఈ మంత్రాన్ని శుక్రవారం 108 సార్లు జపిస్తే ఇంట్లో పరిస్థితుల్లో మార్పువస్తుంది
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.