అన్వేషించండి

Dishti: రోడ్డుపై వీటిని తొక్కేస్తున్నారా - ఏం జరుగుతుందో తెలుసా!

దిష్టి తీసి పడేసిన కొబ్బరికాయ చిప్పలు, నిమ్మకాయలు, గుమ్మడికాయ, మిరపకాయలు తొక్కుతున్నారా? వాటిని తొక్కితే ఏమవుతుంది?

Dishti: రోడ్లపై షాప్స్ ముందు కొబ్బరికాయ చిప్పలు, నిమ్మకాయలు, గుమ్మడికాయ, మిరపకాయలు కనిపిస్తుంటాయి. అవన్నీ దుకాణాలకు దిష్టి తీసి పడేసినవే. కొందరు వాటిని తప్పించుకుని అడుగేస్తే మరికొందరు చూసుకోకుండా తొక్కేస్తారు.. ఇంతకీ తొక్కితే ఏం జరుగుతుంది

'నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా  నలిగిలిపోతుంది' అనే మాట వినే ఉంటారుగా. ఇంట్లో పెద్దవారి నుంచి ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది.   దిష్టి తీయడమనే ప్రక్రియ ఎప్పటినుంచో ఉంది. నేటి తరం దానిని నమ్మినా నమ్మకపోయినా దిష్టి తగలడం ఉందనే స్ట్రాంగ్ గా చెబుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై అనుకూల దిశగా పనిచేస్తే పర్వాలేదు కానీ  వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడే చికాకు పెరుగుతుంది. తలనొప్పి ,వికారం, వాంతులు సహా నలతగా అనిపిస్తుంటుంది. దీనినే దిష్టి తగలడం అంటారు. దృష్టి నుంచి తగిలే దోషం కాబట్టి దిష్టి అంటారు.

Also Read: శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం ఎందుకు ప్రత్యేకం!

దిష్టి ఇలా తీస్తారు

  • తక్షణం ఉపశమనం లభించడం కోసం ఉప్పుతో దిష్టితీసి నీట్లో వేస్తారు
  • ఎండుమిరపకాయలు-తలవెంట్రుకలతో మూడుసార్లు తిప్పి తీసుకెళ్లి మంటల్లో వేస్తారు.. సాధారణంగా మిరపకాయలు మంటల్లో వేస్తే  భరించలేనంత ఘాటు వస్తుంది..అయితే దిష్టి ఉన్నప్పుడు మాత్రం ఘాటు రాదని చెబుతారు
  • తాంబూలంలో వేసే వక్కతో కూడా దిష్టితీస్తారు. పిల్లలు చికాకుగా కనిపించినప్పుడు, ఆగకుండా నసపెట్టి ఏడుస్తున్నప్పుడు వక్క దిగదుడిచి పడేస్తారు
  • దిష్టి మరీ తీవ్రంగా ఉంది కనీసం మెతుకుకూడా ముట్టుకోవడం లేదనే పరిస్థిత వస్తే మాత్రం అప్పుడే వండి అన్నంలోంచి మూడు ముద్దలు తీసుకుని పసుపు, కుంకుమ, బొగ్గుమసి కలపి దిష్టి తీసి ఓ కూడలిలో పెట్టేస్తారు. కొందరైతే కోడి గుడ్డుతో కూడా దిష్టి తీస్తారు.
  • నూనెలో నానబెట్టిన వస్త్రంతో చేసిన పోడుగాటి ఒత్తిని దిష్టితీసి కాలుస్తారు
  • చీపురు-పేడతో దిష్టి తీస్తారు
  • పాత చెప్పులు చుట్టూ తిప్పి నేలపై కొడతారు
  • దిష్టి తీసేటప్పుడు మూడుసార్లు తిప్పడం వెనకున్న ఆంతర్యం ఏంటంటే వారిపై ప్రసరించిన విద్యుత్ కిరణాలను విచ్ఛిన్నం చేయడమే అంటారు పండితులు వస్తువులను మూడుసార్లు చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించిన విద్యుత్ కిరణాలను విచ్ఛిన్నం చేయడం అని అర్థం. 

దిష్టి కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు వారి వృత్తి, వ్యాపారల మీద, పంటపొలాలు, ఇళ్లపైనా ప్రభావం చూపిస్తాయి. అందుకే ఇళ్లకు-కార్యాలయాలకు గుమ్మడికాయ, కొబ్బరికాయ దిష్టి తీసి కట్టేవారు కొందరైతే... వారానికోసారి అయినా వాటిని తిప్పి బయట పడేసేవారు ఇంకొందరు.  ముఖ్యంగా అమావాస్య రోజు ఈ ఎక్కువమంది దిష్టి తీసేపనిలో పడతారు. వ్యాపారులైతే రాత్రిసమయంలో దుకాణం మూసేసే ముందు, పొద్దున్నే ఓపెన్ చేసిన వెంటనే నిమ్మకాలు దిష్టితీసి పడేస్తుంటారు. ఇలా చేస్తే దృష్టిదోషం పోతుందన్నది వారి విశ్వాసం.

Also Read: ఇళ్లు, షాపుల ఎంట్రన్స్ లో నిమ్మకాయ, మిరపకాయ ఎందుకు కడతారు

దిష్టితీసి పడేసినవి తొక్కుతున్నారా
ఇలా దిష్టి తీసిపడేసినవి తొక్కితే ఏమవుతుందన్నది చాలామంది సందేహం. దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కితే అనారోగ్యం పాలవుతారని, అప్పటినుంచీ అంతా చెడే జరుగుతుందనే భయంలో ఉంటారుయ అందుకే రోడ్డుపై ఎక్కడైనా దిష్టితీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్లిపోతారు. వాస్తవానికి వీటిని తొక్కినంతమాత్రాన ఏమీ జరిగిపోదన్నది పండితుల మాట. ఎందుకంటే  గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ..ఈ మూడూ  మంచిని బయటకు వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయట. చెడుని ఆకర్షిస్తాయని చెప్పారు కదా వాటిని తొక్కితే చెడుజరుగుతుంది కదా అనే  సందేహం వచ్చి ఉండొచ్చు..మీ సందేహం నిజమే కానీ ఈ మూడు వస్తువులూ చెడుని ఆకర్షిస్తాయి కానీ చెడుని వెదజల్లవు. అందుకే వాటిని తొక్కినంతమాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటున్నారు పండితులు...

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం  పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Embed widget