Sravana Masam 2023 : శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం ఎందుకు ప్రత్యేకం!
ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. ఇక శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలు అమ్మవారికి మరింత ప్రత్యేకం. ఇంతకీ శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం అంటే ఎందుకంత ఇష్టం...
Sravana Masam 2023 : శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యవంతులవుతారని చాలామంది భక్తులు విశ్వసిస్తారు. అందుకే చాలామంది ఇంట్లో సంతోషం, శ్రేయస్సు, సంపద కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని విధిగా పూజిస్తారు. వారంలో 7 రోజులుండగా లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎందుకంత ప్రత్యేకం అనే సందేహం వస్తుంది. మానవులే కాదు పురణాల్లో రాక్షసులు సైతం శ్రీ మహాలక్ష్మిని శుక్రవారమే పూజించేవారట. రాక్షసులు కూడా ఆ రోజే లక్ష్మీదేవినిఎందుకు ఆరాధించేవారు? అందునా రాక్ష సంహారి అయిన శ్రీ మాహావిష్ణువు భార్యను రాక్షసులు పూజించడం ఏంటనే సందేహాలకు వివరణాత్మక సమధానం చెబుతారు పండితులు
Also Read: ఇళ్లు, షాపుల ఎంట్రన్స్ లో నిమ్మకాయ, మిరపకాయ ఎందుకు కడతారు
శుక్రాచార్యుడి సోదరి
రాక్షసుల గురువైన శుక్రాచార్యు డి పేరుమీదే శుక్రవారం ఏర్పడిందని చెబుతారు. శుక్రాచార్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు. లక్ష్మీదేవికి కూడా తండ్రి. అందుకే లక్ష్మీదేవిని భార్గవి అని పిలుస్తారు. అంటే లక్ష్మీదేవికి సోదరుడు శుక్రాచార్యుడు. అందుకే ఆమెకు శుక్ర వారం అంటే ప్రీతికరమైనది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంతోపాటు శుక్ర గ్రహాన్ని కూడా పూజిస్తారు. ఇది కెరీర్, వ్యాపారం ప్రేమ సంబంధాలలో విజయాన్నిస్తుందని చెబుతారు పండితులు.
ఎరుపు, ఆకుపచ్చ ప్రత్యేకం
లక్ష్మీదేవికి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిథి. అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఏ చిత్రంలో చూసినా నిండా బంగారు ఆభరణాలతో కనిపిస్తుంది. బంగారం ఐశ్వర్యానికి చిహ్నం, ఐశ్వర్యానికి అధిదేవత లక్ష్మీదేవి. అందుకోసమే అమ్మవారిని సర్వాలంకృతగా చిత్రీకరిస్తారు.
Also Read:ఆగష్టు 9 రాశిఫలాలు, ఈ రాశులవారు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు
శ్రీ మహాలక్ష్మి అష్టకం
ఇంద్ర ఉవాచ
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥
ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం
Also Read: ఆగష్టు 9 న్యూమరాలజీ, ఈ తేదీల్లో జన్మించినవారికి ఆదాయం పెరిగే రోజు ఇది!