News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Numerology Predictions 9th August 2023: ఆగష్టు 9 న్యూమరాలజీ, ఈ తేదీల్లో జన్మించినవారికి ఆదాయం పెరిగే రోజు ఇది!

Numerology prediction 9th Augustc 2023: సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆగష్టు 9 న ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.

FOLLOW US: 
Share:

Astrology Predictions by Numbers

నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)

ఈ రోజు మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అంత అనుకూలంగా ఉండదు. సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. వివాదాల పరిస్థితికి దూరంగా ఉండండి. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వాహనాలు, యంత్రాలు వినియోగించేటప్పుడు జాగ్రత్త వహించండి.  పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి

నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)

ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు, వ్యాపారాలకు గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారం పుంజుకుంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. కుటుంబం గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. ఖర్చుకు మించి ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సామాజిక సేవలో కార్యకలాపాలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఉదర వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. 

నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు సంయమనంతో పనిచేయాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రణాళికలపై పని ప్రారంభించే ముందు, అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో భావోద్వేగానికి లోనై నిర్ణయాలు తీసుకోవద్దు. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు, ఆగష్టు 07 నుంచి 13 వారఫలాలు

నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)

ఈ రోజు మీ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. భవిష్యత్తు గురించి చింత మనసులో ఉండిపోతుంది. మీరు పనిచేసే రంగంలో వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మాటలు ,కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది.  కొత్త ప్రణాళికలపై పని ప్రారంభించే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది. 

నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)

ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త పథకాలపై పనులు ప్రారంభించవచ్చు. కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆకస్మిక లాభ అవకాశాలు లభిస్తాయి. భావోద్వేగానికి లోనై నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఉదర వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. 

నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)

ఈరోజు ఈ తేదీల్లో జన్మించిన వారు ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం పుంజుకుంటుంది. ఆర్థిక విషయాల్లో విజయం మీవైపే ఉంటుంది. ప్రమాదకర సందర్భాల్లో జాగ్రత్త వహించాలి. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమికులు మనసులో మాట చెప్పేందుకు, పెళ్లి దిశగా అడుగేసేందుకు ఇదే మంచి సమయం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 

Also Read: ఆత్మలింగంపై వస్త్రాన్ని రావణుడు విసిరేస్తే ఏర్పడిన క్షేత్రం - ప్రపంచంలో రెండో అతిపెద్ద శివుడి విగ్రహం!

నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)

ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు పనిచేసే రంగంలో, వ్యాపారంలో అదృష్టం  కలిసొస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు.  ఏకాగ్రతను కాపాడుకోండి. ఖర్చులు పెరుగుతాయి.  మీరు ముఖ్యమైన విషయాలలో నిర్ణయం తీసుకోవాలనుకుంటే అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. వ్యాపార పోటీలకు దూరంగా ఉండండి. కష్టపడి పనిచేయండి. కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది. 

నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)

ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధగా ఉండాలి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ఖర్చులు తగ్గించండి. మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. 

నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)

ఈ రోజు మీ శత్రువులు చురుగ్గా ఉంటారు..అందుకే ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో చురుకుదనం పెంచండి. ఈ తేదీల్లో జన్మించిన ఉద్యోగులు...సహోద్యోగులు, అధికారులతో విభేదాలు పెట్టుకోపోవడం మంచిది. ఏ పనిలోనూ తొందరపడకండి. ఖర్చులు పెరుగుతాయి. చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో పోటీ పరిస్థితులకు దూరంగా ఉండండి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. వాతావరణ మార్పుల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.

గమనిక: ఈ ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Published at : 09 Aug 2023 05:14 AM (IST) Tags: Numerology ank jyotish rashifal horoscope rashifal Astrology Predictions by Numbers Numerology Prediction 9th August 2023

ఇవి కూడా చూడండి

Horoscope Today October 02, 2023: ఈ రాశివారు మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి, అక్టోబరు 2 రాశిఫలాలు

Horoscope Today October 02, 2023: ఈ రాశివారు మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి, అక్టోబరు 2 రాశిఫలాలు

Vastu Tips In Telugu: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టే సూపర్ టిప్స్ ఇవే!

Vastu Tips In Telugu: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టే సూపర్ టిప్స్ ఇవే!

Pitru Paksham 2023: మీరు తీర్చుకోవాల్సిన రుణాల్లో అతి ముఖ్యమైన రుణం ఇది - ఎందుకో తెలుసా!

Pitru Paksham 2023:  మీరు తీర్చుకోవాల్సిన రుణాల్లో అతి ముఖ్యమైన రుణం ఇది - ఎందుకో తెలుసా!

Pitru Paksham 2023: అక్టోబరు 14 వరకూ పితృ పక్షం - ఈ 15 రోజులు ఎందుకు ప్రత్యేకం!

Pitru Paksham 2023:  అక్టోబరు 14 వరకూ పితృ పక్షం -  ఈ 15 రోజులు ఎందుకు ప్రత్యేకం!

Vidur Niti In Telugu : ఈ 4 ల‌క్ష‌ణాలున్న‌వారికి జీవితమంతా ఆర్థిక ఇబ్బందులే!

Vidur Niti In Telugu : ఈ 4 ల‌క్ష‌ణాలున్న‌వారికి జీవితమంతా ఆర్థిక ఇబ్బందులే!

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్