Image Credit: Pixabay
Horoscope Today 2023 August 9th
మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆర్థిక సమస్యలు ఎదురుకావొచ్చు. మీ మాటలు సున్నితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులు ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు శత్రువులను అధిగమిస్తారు.
వృషభ రాశి
ఈ రోజు మీ దినచర్య చాలా క్రమశిక్షణతో ఉంటుంది. ప్రముఖులతో సత్సంబంధాలు ఉంటాయి. ఈ రోజు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఆరోగ్య సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఓ గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది.
మిథున రాశి
ఈ రాశివారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అత్యుత్సాహం ప్రదర్శించి తక్షణ నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు. తద్వారా మీ గౌరవం తగ్గుతుంది.అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త.
కర్కాటక రాశి
మీ సలహా ఇతరులకు మేలు చేస్తుంది. ఇనుము వ్యాపారంలో భారీ లాభం ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేయవచ్చు. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
సింహ రాశి
ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకుంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది తొందరగా అలసిపోతారు. అనవసర ప్రకటనలు చేయవద్దు. అనుకోని అవమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు . ఎవ్వరికీ హామీలు ఇవ్వొద్దు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఎదురైన అడ్డంకులు ఒక్కొక్కటీ తొలగిపోతాయి.
Also Read: ఇంటి ఆవరణలో ఉండాల్సిన - ఉండకూడని చెట్లు ఇవే!
కన్యా రాశి
ఈ రాశివారు జీవిత భాగస్వామికి సమయం ఇవ్వలేకపోవడం వల్ల వివాదాల పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ రాశి ఉద్యోగులు కూడా కార్యాలయంలో వ్యతిరేక ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ లక్ష్యాలతో మీరు గందరగోళం చెందవద్దు. ఆధ్యాత్మిక చర్చల ద్వారా ఆనందాన్ని పొందుతారు. ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు.
తులా రాశి
ఈ రోజు ఈ రాశివారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పని చేసేందుకు ఆసక్తి ఉండదు. అధికారులు కూడా మీ పనిపట్ల అసంతృప్తి చెందుతారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడతారు. అపరిచితులను ఎక్కువగా నమ్మొద్దు. మనసులో ప్రతికూల ఆలోచనలు నిరాశ ఉంటుంది. సన్నిహితుల నుంచి సహకారం ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు లేదంటే ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం పొందుతారు. జీవిత భాగస్వామి పట్ల కొంత ఆందోళన ఉంటుంది. సంబంధాలను అనుమానించకండి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ రోజు మంచి రోజు. క్లిష్ట పరిస్థితులను అధిగమించి విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి అధ్యనాలపై ఆసక్తి పెరుగుతుంది. లోతైన రహస్యాలను అర్థం చేసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ప్రమాదకర పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శరీరంలో చురుకుదనం లోపిస్తుంది. కార్యాలయంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. తలపట్టిన పనుల విషయంలో సంతృప్తి ఉంటుంది. సహోద్యోగులు మిమ్మల్ని నిరాశపర్చేందుకు ప్రయత్నిస్తారు కానీ మీరు స్ట్రాంగ్ గా ఉండాలి.
Also Read: నెల రోజుల పాటూ ఈ 3 రాశులవారికి రాజయోగం!
మకర రాశి
ఈ రాశివారికి ఈ రోజు అంత మంచి రోజు కాదు. ఏపని తలపెట్టినా పూర్తికాదు..ఏదో చికాకుగా ఉంటారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. షేర్ మార్కెట్లో భారీ పెట్టుబడులు పట్టేందుకు అనుకూల సమయమే. పిల్లల భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
కుంభ రాశి
ఈ రాశివారు ఈ రోజు గందరగోళానికి గురవుతారు. ఆ ప్రభావం మీ పనిపై పడుతుంది. ఏదో విషయంలో అనవసర అనుమానాలు పెట్టుకుంటారు. కొన్ని రహస్యాలు మీ ముందు బహిర్గతమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తికి సంబంధించిన వివాదాలు తలత్తే అవకాశం ఉంది. అనారోగ్యం పాలవడంతో ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.
మీన రాశి
ఈ రాశివారికి విశ్వాసం పెరుగుతుంది. నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. పొదుపుపై చాలా శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. స్నేహితులు, సన్నిహితుల నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Vastu Tips In Telugu: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టే సూపర్ టిప్స్ ఇవే!
Pitru Paksham 2023: మీరు తీర్చుకోవాల్సిన రుణాల్లో అతి ముఖ్యమైన రుణం ఇది - ఎందుకో తెలుసా!
Pitru Paksham 2023: అక్టోబరు 14 వరకూ పితృ పక్షం - ఈ 15 రోజులు ఎందుకు ప్రత్యేకం!
Vidur Niti In Telugu : ఈ 4 లక్షణాలున్నవారికి జీవితమంతా ఆర్థిక ఇబ్బందులే!
Chanakya Niti: తనకు మాలిన ధర్మం పనికిరాదంటారు ఎందుకు - దీనిపై చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా!
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
/body>