అన్వేషించండి
Advertisement
Spirituality: ఆధ్యాత్మికంగా 108 కి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా..
108... వన్ జీరో ఎయిట్ అని ఇంగ్లీష్ లో చదవగానే కుయ్ కుయ్ అనే సౌండ్ గుర్తొస్తుందేమో కానీ.. ఈ నంబర్ కి ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకత ఉంది. అదేంటో చూడండి...
ఆధ్యాత్మికంగా 108 కి ఉన్న ప్రాధాన్యత ఇదే..
- ఉపనిషత్తులు 108
- దేవుడి అష్టోత్తర నామావళి ( అంటే 108 నామాలు)
- జపం చేసే మాలలో పూసలు 108
- పురాణాల ప్రకారం చంద్రుడికి భూమికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
- ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలున్నాయి
- దేవభాషలో అక్షరాలు 108
- భరతుడి నాట్య శాస్త్రంలో నాట్య భంగిమలు 108
- దేవాలయంలో 108 ప్రదక్షిణలు చేయటం శ్రేష్టం
- గాయత్రి 108 సార్లు జపిస్తే సకల శాస్త్రాలను పూజించినట్లే అంటారు.
- శ్రీ చక్రయంత్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలున్నాయి
- 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి
Also Read: మీ రాశి మీ బలహీనత ఏంటో చెప్పేస్తుంది.. మీ వీక్ నెస్ ఏంటో తెలుసుకోండి..
హిందువులు 108 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఎన్నో కారణాలున్నాయి
- రాశి-నక్షత్రాల పరంగా చూస్తే 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108 అని, ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటాడు. 12 రాశులు..ఒక్కో రాశిలో 9 నక్షత్ర పాదాలు = 12x9=108
- ఖగోళ పరంగా సూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6 మిలియన్ కిలోమీటర్లు. ఈ దూరాన్ని సూర్యుని చుట్టుకొలత 1391000 కి.మీ. తో భాగిస్తే వచ్చే సంఖ్య కాస్త అటు ఇటు 108, అలాగే చంద్రుడికి భూమికి ఉన్న దూరం 38లక్షల కిలోమీటర్లు. దాన్ని చంద్రుని చుట్టుకొలతైన 3474 కిలోమీటర్లతో భాగిస్తే వచ్చే సంఖ్య 108.
- ముఖ్యమైన శివలింగాల సంఖ్య 108, అందుకే శైవ మతస్థులు 108 కు ప్రాముఖ్యతనిస్తుంటారు.
- గౌడియ వైష్ణవంలో బృందావనలో 108 గోపికలను పూజిస్తారు.
- దేశంలో 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు ఉన్నాయి.
- బౌద్ధ సంప్రదాయం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహను కలిపి ఆరు భావాలను, వాటివల్ల కలిగే అంతర్భావాలైన సుఖం, దుఃఖం, స్తిరత్వబుద్ధిని గుణించి, అవి బాహ్యంగానైనా, ఆంతరంగికంగానైనా భూత భవిష్యత్ వర్తమానాలలో కలిగిన భావనలను గుణిస్తే 6x3x2x3 = 108 సంఖ్య వస్తుంది.
- శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో అంటే 24 గంటల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే 12 గంటల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడని లెక్క. ఈ లెక్క ప్రకారం మనిషి దేవుడిని తలచుకునేటప్పుడు 10800 సార్లు చేయడం కష్టం కాబట్టి చివరి రెండు సున్నాలు తీసేసి 108ను ప్రామాణికంగా ఉంచారని కొందరు పెద్దలు చెబుతుంటారు.
Also Read:మీ పేరు 'N'తో మొదలైందా... మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం...
Also Read: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement