Adhika Maasam 2023: ఈ ఏడాది శ్రావణం అధికమాసం, ఇంతకీ అధికమాసం - క్షయమాసం అంటే ఏంటి!
ఈ ఏడాది (2023) లో శ్రావణం అధికమాసం వస్తోంది. అంటే శ్రావణం రెండు నెలలపాటు ఉంటుంది. ఇంతకీ అధికమాసం అంటే ఏంటి? ఇవెందుకు వస్తాయి? ఏడాదికి 12 నెలలే అయినప్పుడు అధికమాసాన్ని ఎలా లెక్కిస్తారు..
Adhika Maasam 2023: 18 జూలై 2023 నుంచి అధిక శ్రావణమాసం ప్రారంభమై ఆగస్టు 16 తో ముగుస్తుంది. ఆగస్టు 17 నుంచి నిజ శ్రావణమాసం ప్రారంభం అవుతుంది.
అధికమాసం అంటే
హిందువుల కాలగణన ప్రకారం తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, ఋతువులు, పంచాంగ గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంపావు రోజులు వ్యత్యాసం ఉంటుంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం కూడా జరగదు. చాంద్రమానంలో సూర్య సంక్రాంతి లేని మాసాన్ని 'అధికమాసం' అంటాం. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని అంటారు.
Also Read: జూలై 2 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశులవారి అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది
సూర్య సంక్రాంతి
సూర్య సంక్రాంతి అంటే..సూర్యుడు ప్రతి నెలా ఓ రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి, మకర సంక్రాంతి ఇలా ఏడాదికి 12 సంక్రాంతిలు వస్తాయి. ఈ సంక్రాంతులలో ప్రముఖమైమనవి కర్కాటక సంక్రణమం, మకర సంక్రమణం. ఇలా 12 నెలల్లో 12 రాశులు మారే సూర్యుడు ఒక్కోసారి ఓ నెలలో ఏ రాశిలోకి ప్రవేశించడు. అలా సూర్యుడు ప్రవేశించని మాసమే అధికమాసం అంటారు. ఆ నెలలో శుభకార్యాలు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదంటారు పెద్దలు. సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే మూలం అయినప్పటికీ అలా ఏర్పడిన 12 చాంద్రమాసాలను సంవత్సరం అనలేము. కేవలం సూర్యుడు 12 రాశుల్లో సంచరించడం పూర్తైతేనే సౌరమాసం అని అలాంటి 12 నెలలు కలిపితే సంవత్సరం అని పరిగణిస్తాం. అలా సూర్యుడి సంక్రమణం జరగని నెలను శూన్యమాసం అని అధికమాసం అని పరిగణిస్తారు.
Also Read: జూలై 5 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశులవారు ఆర్థికంగా లాభపడతారు
అధికమాసం వచ్చేది చంద్రమానం వల్లే
అధిక మాసము చంద్రమానం ద్వారానే వస్తుంది. చాంద్ర మానం అంటే చంద్ర కళలను ( తిథుల ) ఆధారంగా నెల రోజులను లెక్కించడం.
సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అంటే 12 x 27 = 324 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజుల 6 గంటలు 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె 324 రోజులే పడుతుంది.
వీరిద్దరి మధ్య సుమారు 41 రోజులు తేడా ఉంది. ఈ వ్యత్యాసం వలన భూమి సూర్యుని చుట్టూ 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు ఏడాదికి 12 మాసాల చొప్పున 228 నెలలు రావాల్సి ఉండగా 235 మాత్రమే వస్తున్నాయి. అంటే చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగుతున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌర మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే.
అధికమాసం కేవలం ఈ నెలల్లోనే వస్తుంది
అధికమాసం కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలకు మాత్రమే వస్తుంది. చైత్రం కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం మాసాలకు ఎప్పుడూ అధికమాసం రాదు. ఒక సారి అధిక మాసం వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని అంటారు. అంటే ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు. అయితే అధికమాసంలో జన్మించిన వారు అందరిలా కాకుండా ప్రత్యేక మార్గంలో వెళితే సక్సెస్ అవుతారు.
Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!
క్షయమాసం
ఏ నెలైతే సూర్యుడు ఒకేనెలలో రెండు సంక్రాంతిలు మార్చుకుంటాడు అలాంటప్పుడు అది క్షయమాసం అవుతుంది. అంటే ఓ నెల లేనట్టే. అంటే నెలకోసారి జరగాల్సిన సూర్య సంక్రమణం నెలలో రెండుసార్లు జరిగిపోతుంది. 30 నుంచి 40 ఏళ్లకోసారి క్షయమాసం వస్తుంది. ఇది కేవలం పుష్యమాసానికి మాత్రమే వస్తుంది. క్షయమాసంలో పుట్టినవారు చాలా అనారోగ్యంతో, జాతకంలో దోషాలతో పుడతారు. ఒక్కోసారి కర్కాటక సంక్రాంతి వరకూ మార్గశిరమాసం మాత్రమే ఉంటే మరి పుష్యమాసం ఉండదు. మార్గశిరం తర్వాత మాఘమాసం వచ్చేస్తుంది.
అధిక మాసం అనుష్ఠానాలకు, జపతపాలకు విశిష్టమైంది. యధాశక్తి దాన ధర్మాలు, సంతర్పణలు చేయడం మంచిది. పితృకార్యాలు మాత్రం యథావిధిగా నిర్వహించాలని శాస్త్రం చెబుతోంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.