జూలై 2 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశులవారి అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది
Rasi Phalalu Today June 2nd : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
![జూలై 2 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశులవారి అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది Horoscope Today 2023 July 2nd: Raasiphalau Todays prediction for Aries, Gemini, Leo Cancer and other zodiac signs జూలై 2 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశులవారి అదృష్టం సూర్యునిలా ప్రకాశిస్తుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/01/2d7baaec6b37215eb9432c4d266e2a801688210710085217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope Today (జూలై 2 రాశిఫలాలు)
మేషరాశి
ఈ రాశివారు వ్యాపారంలో కష్టపడవలసి ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. బంధువుల నుంచి కొంత ఇబ్బందికర సమాచారం అందుతుంది. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. అప్పులు తీసుకునే ధోరణికి దూరంగా ఉండాలి. పిల్లల మంచి చెడులను జాగ్రత్తగా చూసుకోండి.
వృషభ రాశి
శత్రువులు మిమ్మల్ని అవహేళన చేయవచ్చు. మనస్సులో అస్థిరత , ఏదో బాధ ఉంటుంది. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండొచ్చు. గొంతు ఇన్ఫెక్షన్ సమస్యలు రావచ్చు. వివాహేతర సంబంధాలు ఒత్తిడిని కలిగిస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
మిధున రాశి
ఈ రాశివారు ధనలాభం పొందే అవకాశం ఉంది. మీ సమర్థత పెరుగుతుంది. రాబోయే రోజుల కోసం పెద్ద ప్రణాళికలు చేయవచ్చు. శుభ కార్యాలలో పాల్గొనవచ్చు. పని పట్ల ఏకాగ్రత ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. సామాజిక సేవ చేస్తారు
Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!
కర్కాటక రాశి
మీరు ఇబ్బందుల్లో పడతారు. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. మీ మాటలతో అందర్నీ మెప్పిస్తారు. మీరు ఎంచుకున్న రంగంలో మీ క్రియాశీలత పెరుగుతుంది. కొన్ని వ్యాధుల వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులను కలుస్తారు.
సింహ రాశి
ఈ రాశివారు మొండి ప్రవర్తనకు దూరంగా ఉండాలి. అలసట వలన బలహీనత ఉంటుంది. ఇతరుల భావాలపై ఎక్కువగా ఆధారపడవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం. కడుపునొప్పి సమస్య రావచ్చు. ఆదాయం సాధారణంగా ఉంటుంది ఖర్చులు తగ్గించండి.
కన్యా రాశి
ఈ రాశివారు అన్నింటా ప్రయోజనం పొందుతారు. సోదరుల పురోగతితో మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆదరణ పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ఊహించని ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మార్కెటింగ్ సంబంధిత పనులకు రోజు అనుకూలంగా ఉంటుంది.
Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి!
తులా రాశి
ఈ రాశివారు ఈ రోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీరు షేర్లలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ రోజు ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీ ఆలోచనలను మీ జీవిత భాగస్వామితో పంచుకోవడం సముచితంగా ఉంటుంది. మీ రంగంలో సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి గౌరవం లభిస్తుంది. ప్రత్యర్థుల కన్నా పై చేయి సాధిస్తారు. మీరు పిల్లల వైఖరితో సంతృప్తి చెందుతారు. న్యాయపరమైన విషయాల్లో విజయం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. మీ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.
ధనుస్సు రాశి
ఈ రాశివారు ఉదర సంబంధిత సమస్యలతో బాధపడతారు. సహోద్యోగితో విబేధాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణం చేస్తారు. స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. అపరిచితుడిని ఎక్కువగా నమ్మడం మంచిది కాదు.
మకర రాశి
ఈ రాశివారు ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో మీ లగేజీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనవసర పనుల కోసం మీ సమయాన్ని వృథా చేయకండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఓపికతో పని చేయండి.
కుంభ రాశి
శత్రువులు మీ స్నేహితులు అయ్యే అవకాశముంది. లక్ష్య సాధనకు కృషి చేస్తారు. ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. ఆందోళన తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ కళను మెరుగుపరిచే అవకాశం మీకు లభిస్తుంది.
మీనరాశి
ఈ రాశివారు జీవితాన్ని ఆస్వాదిస్తారు. కార్యాలయంలో అధికారాలు పెరిగే అవకాశం ఉంది. లోతైన అంశాలపై చర్చించనున్నారు. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కార్యాలయంలో సమస్యలు ఉంటాయి. ఇంటికి అతిథులు వస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)