Bharani Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!
Astrology In Telugu: మీ జన్మ నక్షత్రం మీ గుణగణాలను నిర్ణయిస్తుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ ఫలితాలు కూడా పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా ఉంటాయి. మీ నక్షత్రం ఆధారంగా మీ గుణగణాలు తెలుసుకోండి..
Characteristics of Bharani Nakshatra: 27 నక్షత్రాలలో రెండోది భరణి. ఈ నక్షత్రం వారు బయటకు మాత్రం పొగడ్తలంటే ఇష్టంలేనట్టుంటారు కానీ లోలోపల ఆస్వాదిస్తారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకోవడంలో సక్సెస్ అవుతారు. సందర్భాన్ని బట్టి తమ అభిప్రాయాలు మార్చేసుకుంటారు. ఎదుటివారిని ఎంతబాగా పొగుడుతారో అంతే కఠినంగా విమర్శించగలరు. తమ వైఖరిని మార్చుకోపోవడం వల్ల ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేరు. వృద్ధాప్యంలో సుఖంగా జీవించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరి వ్యూహాలు అద్భుతంగా ఉంటాయి సలహాదారులుగా బాగా రాణిస్తారు.
మేషరాశిలో రెండో నక్షత్రం భరణి. నాలుగు పాదాలూ మేషరాశిలోనే ఉన్నాయి.ఈ నక్షత్రం స్త్రీ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ ఉగ్రతారగా గుర్తింపు పొందింది. శుక్రుడు అధిపతిగా ఉండే ఈ నక్షత్రంవారిలో రజోగుణం ఎక్కువ.
Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి!
భరణి మొదటి పాదం
శారీరకంగా శక్తివంతులై ఉంటారు. పౌరుషం ఎక్కువ,శత్రువులను లొంగదీసుకోవడంలో వీరిదే పైచేయి. పంతాలు పట్టింపులు చాలా ఎక్కువ. ఏదైనా సాధించుకోగలరు. పెద్దలపట్ల గౌరవం, ఆచార వ్యవహారాల పట్ల, సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు. తమ పనిలో లోపాలు బయటపడకుండా నిరంతరం జాగ్రత్తపడుతుంటారు
భరణి రెండో పాదం
భరణి రెండో పాదంవారికి పంతం, పట్టుదల అధికం. అనుకున్నది ఎలాగైనా పూర్తిచేస్తారు. పలు సందర్భాల్లో మొండితనంగా వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడపడంతోపాటూ మంచి చెడులపై అవగాహన, నీతినియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు. ఆలోచనా ధోరణి ఎక్కువ. అనవసర విషయాలపై కూడా ఎక్కువగా శోధిస్తారు
భరణి మూడో పాదం
భరణి మూడోపాదంలో జన్మించిన వారు తమ ప్రమేయం లేకుండానే ఫలితం ఆశిస్తారు. వాస్తవానికి-ఆలోనచకు మధ్య ఎలాంటి పొంతన ఉండదు. తెలివితేటల విషయంలో గొప్పవారే. పొగడ్తలంటే వీరికి మహాసరదా. శక్తివంతులు కావడం వల్ల ఆధిక్యాన్ని ప్రద్శించేందుకు మందుంటారు. కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ నిగ్రహ శక్తిని కలిగి ఉంటారు. ఈ పాదంలో జన్మించినవారికి దైవభక్తి ఎక్కువ
భరణి నాలుగోపాదం
భరణి నాలుగోపాదంలో జన్మించినవారు ఊహల్లో ఉంటారు. ఆడంబరాన్ని కోరుకుంటారు. పంతం పట్టి అనుకున్న పనులు సాధించుకుంటారు. కష్టమైనా నష్టమైనా తమదే పైచేైయి ఉండాలనుకుంటారు.కోపం ప్రదర్శిస్తారు..బతిమలాడించుకునే మనస్తత్వం కలిగు ఉంటారు. గర్వంతో వ్యవహరిస్తారు
Also Read: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!
భరణి నక్షత్ర పురుషుల గుణగణాలు
- ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు ఇతరులును బాధపెట్టరు, మనస్సాక్షిని వదులుకోరు
- తన మనసులోని మాటను ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పేస్తారు అందుకే అందరి దృష్టిలో చెడుగా మిగులుతారు
- ఎదుటివ్యక్తులను తొందరగా అపార్థం చేసుకుంటారు అంతే తొందరగా క్షమించేస్తారు
- ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులకు సరైన కెరీర్ ఏదన్నది చెప్పలేం. కళలు, సంగీతం, మీడియా, క్రీడలు, వ్యాపారం, ఉద్యోగం ఇలా ఎందులోనైనా రాణిస్తారు
- 33 ఏళ్లు నిండిన తర్వాత కెరీర్లో ఎదుగుదల ఉంటుంది, ఆస్తులు సమకూరుస్తారు
- భరణి నక్షత్రంలో జన్మించిన మగవారు తమ కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు కానీ వారికి మాత్రం తల్లిదండ్రుల ప్రేమ పూర్తిస్థాయిలో దక్కదు
- ఈ నక్షత్రంవారికి స్నేహితుల నుంచి మంచి సహకారం ఉంటుంది
- భరణిలో జన్మించిన పురుషులకు సాధారణంగా 27 నుంచి 32 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంటారు
- వీరు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు..పెద్ద వయసు వచ్చిన తర్వాత మధుమేహం, మలేరియా, అపోప్లెక్సీ , దంత సమస్యలు ఎదుర్కొంటారు
- భరణి పురుషుడు ఆహార ప్రియుడే కానీ తినడం కోసమే బతికే రకం కాదు, వీరిపై వీరికి నియంత్రణ ఉంటుంది
భరణి నక్షత్ర స్త్రీల గుణగణాలు
- ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు బోల్డ్, స్ట్రాంగ్ గా మాట్లాడే స్వభావం ఉన్నవారు అవుతారు
- వీరిది స్వచ్ఛమైన మనస్తత్వం, అమాయకత్వం కూడా ఎక్కువే
- ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఆకర్షణీయంగా ఉంటారు, అందర్నీ ఆకట్టుకోవాలని కోరుకుంటారు
- చాలా స్వతంత్రంగా ఉంటారు, ఎదుటివారి ఆలోచనలను పక్కనపెట్టేసి మనసు చెప్పిందే చేస్తారు
- భరణి స్త్రీ స్వతంత్ర వృత్తి-ఆధారిత వ్యక్తి. అవకాశాల కోసం ఎదురుచూడకుండా అవకాశాల కోసం వెతుక్కుంటారు
- వీరి స్వభావ రీత్యా సేల్స్ , టూరిస్ట్ గైడ్ ఉద్యోగాలు అనువుగా ఉంటాయి, క్రీడల్లోనూ రాణిస్తారు
- భరణి స్త్రీ ప్రేమగల జీవిత భాగస్వామిని ఎంపికచేసుకుంటారు, సంతోషకరమైన వైవాహిక జీవితం గడుపుతారు
- అత్తవారింట్లో విభేదాలు తలెత్తినా అవి సమసిపోతాయి
- ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ మంచి మాటకారులు
- ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ వయసు పెరిగేకొద్దీ ఋతుస్రావం లేదా గర్భాశయ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది
ఈ నక్షత్ర జాతకులకు బాల్యం సుఖంగా నడుస్తుంది. 32 ఏళ్లు దాటిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు మొదలువుతాయి.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. జాతకచక్రం, లగ్నం, పుట్టిన సమయం, మాసాన్ని బట్టి కూడా గుణగణాలలో కొద్దికొద్దిగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.