Budh Gochar 2023: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!
మేష రాశిలో సంచరించిన బుధుడు జూన్ 7 నుంచి వృషభ రాశిలో సంచరించనున్నాడు. ఈ ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..
Budh Gochar 2023: జూన్ 7 న వృషభ రాశిలో ప్రవేశించిన బుధుడు జూన్ 24 వరకూ ఇదే రాశిలో సంచరించి ఆ తర్వాత మిథున రాశిలోకి అడుగుపెడతాడు. ఈ ప్రభావం ద్వాదశ రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారిపై అనుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. వృషభ రాశిలో బుధుడి సంచారం ఏ రాశివారిపై ఎలా ఉంటుందో చూద్దాం..
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ రాశి నుంచి రెండో స్థానంలో బుధుడి సంచరిస్తున్నాడు. ఇది మీకు అనుకూల ఫలితాలనే ఇస్తుంది. మీ ప్రసంగ నైపుణ్యాల బలంతో, మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా నియంత్రించగలుగుతారు. ఆర్థిక, సామాజిక బలం ఉంటుంది. రానిబాకీలు వసూలవుతాయి. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం.
వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఈ రాశిలో బుధుడి సంచారం జరుగుతోంది అందుకే శుభఫలితాలను పొందుతారు. సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది. మీరు నిర్ణయం తీసుకోవాలనుకుంటే అందులో కూడా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. పిల్లలకి సంబంధించిన ఆందోళన తగ్గుతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే ఇదే మంచి సమయం. వివాహితుల జీవితం బావుంటుంది.
Also Read: మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
బుధుడు మీ రాశినుంచి పన్నెండో స్థానంలో సంచరించడం వలన మీకు ఒడిదుడుకులు తప్పవు. ఖర్చులు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునే విద్యార్థులకు మంచి సమయం. గ్రహ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. కోర్టు కేసులకు సంబంధించిన వివాదాలను బయటే పరిష్కరించుకోండి. అప్పులు ఇవ్వొద్దు.
కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
మీ రాశినుంచి పదకొండవ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల కార్యక్షేత్రం విస్తరిస్తుంది. ఏదైనా పెద్ద పనిని ప్రారంభించాలనుకున్నా లేదా కొత్త ఒప్పందంపై సంతకం చేయాలనుకున్నా గ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కూడా సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వృషభ రాశిలో బుధుడి సంచారం ఈ రాశి వ్యాపారులకు లాభాన్నిస్తుంది. భూమి ఆస్తికి సంబంధించిన విషయాల్లో అడుగు ముందుకు పడుతుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఎదురుచూసిన పనులు పూర్తవుతాయి. గ్రహ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
కన్యా రాశి (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ఈ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో బుదుడి సంచారం మీకు అదృష్టాన్నిస్తుంది. అన్ని విధాలుగా అడుగు ముందుకు పడుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ధానధర్మాలు చేస్తారు. క్లిష్ట పరిస్థితులను కూడా నియంత్రించగలుగుతారు. తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనికి ప్రశంసలు పొందుతారు.
తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఎనిమిదో స్థానంలో బుధుడి సంచారం మీకు ప్రతికూల ఫలితాలనిస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. తలపెట్టిన ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి. కొన్ని నిర్ణయాలు మీకు చెడు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి.
వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ రాశి నుంచి ఏడో స్థానంలో బుధుడి సంచారం మీకు మిశ్రమ ఫలితాలనిస్తుంది. వైవాహిక జీవితం బావుంటుంది. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారం, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. తలపెట్టిన పనికి అడ్డంకులున్నా పూర్తవుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఈ రాశినుంచి ఆరో స్థానంలో బుధుడి సంచారం మీకు అంత మంచి ఫలితాలనివ్వదు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి . కోర్టుకి సంబంధించిన విషయాలను బయట పరిష్కరించుకోవాలి. ఉదర సమస్యల పట్ల కూడా జాగ్రత్త వహించండి. మీరు విదేశాలకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
Also Read: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే
మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వృషభంలో బుధుడి సంచారం మకర రాశి నుంచి ఐదో స్థానంలో ఉంటుంది. విద్యార్థులకు ఇది శుభసమయం. పోటీ పరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే మంచిది. అవివాహితులు పెళ్లిచేసుకునేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి ఫలితాలున్నాయి.
కుంభ రాశి (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
నాలుగో స్థానంలో బుధుడి సంచారం మీకు మంచి జరుగుతుంది. పూర్వీకుల ఆస్తులు కలిసొస్తాయి. వాహనాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన అడుగు ముందుకు పడుతుంది. స్నేహితులు, బంధువుల నుంచి శుభవార్తలు అందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించాలనుకుంటే అవకాశం అనుకూలంగా ఉంటుంది.
మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
మూడో స్థానంలో బుధుడి సంచారం మీన రాశివారికి మంచి చేస్తుంది. మీ మాటలో నైపుణ్యం ఉంటుంది. పరిస్థితులను సులభంగా నియంత్రించగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలకు అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.