News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

మీ మనస్తత్వం మీరు పుట్టిన నెల ఆధారంగా కూడా ఉంటుందని చెబుతారు పండితులు. మరి జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా...

FOLLOW US: 
Share:

 Interesting Personality Traits Of June Born People :  సాధారణంగా పుట్టిన సమయం, ప్లేస్ ని బట్టి జాతకచక్రాన్ని వేస్తారు. అందులో గ్రహస్థితి ఆధారంగా వారి భవిష్యత్ ఎలా ఉంటుందో వివరిస్తారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అయితే ఇది ఒక్కో వ్యక్తికి సంబంధించిన జాతకం. కానీ పుట్టిన రోజు, నెలల ఆధారంగా కూడా మీ వ్యక్తిత్వం, మనస్తత్వం ఆధారపడి ఉంటుందంటారు. మీరు జన్మించిన నెల ఆధారంగా చెప్పిన విషయాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని కాదుకానీ ఈ నెలలో జన్మించిన వారిలో కామన్ గా ఉంటే లక్షణాలు ఇవి అని అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. 

Also Read: అక్టోబరులో పుట్టారా, మీరు సింహం లాంటోళ్లని మీకు తెలుసా!

జూన్ నెలలో పుట్టినవారిది డైనమిక్ పర్సనాలిటీ. విద్యావేత్తలు, క్రీడలు, పాటలు, నృత్యాల్లో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఇంకా చెప్పాలంటే జూన్ లో పుట్టినవారు చాలా విషయాల్లో ప్రతిభావంతులు. వీరిని స్నేహితులుగా పొందాలని చాలామంది కోరుకుంటారు. వీరి లక్షణాలు గమనిస్తే.... 

 • జూన్ లో పుట్టినవారు చాలా తెలివైన వారు, వీరి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది
 • అదృష్టానికి కేరాఫ్ అన్నట్టుగా ఉంటారు, ఏం అనుకున్నా పూర్తిచేయడంలో సమర్థులు
 • వీరికి తొందరపాటు చాలా ఎక్కువ, అనుకున్నదే తడవుగా పనులు ప్రారంభించాలని ప్రయత్నిస్తారు
 • వీరి మేథాశక్తి అద్భుతంగా ఉంటుంది, ఏ విషయాన్ని అయినా వెంటనే గ్రహిస్తారు
 • తలపెట్టిన ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు, నలుగురిలో గుర్తింపు అందుకుంటారు
 • ప్రతివిషయాన్ని మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాతే ఆచరణలో పెడతారు
 • నా రూటే సెపరేట్ అన్న టైప్ వీరు. అందుకే ప్రతి పనినీ ప్రత్యేకంగా చేయాలని ఆశపడతారు
 • ఈ నెలలో పుట్టినవారు....కొందరికి ప్రత్యేకంగా, మరికొందరికి ఆకర్షణీయంగా, ఇంకొందరికి చిక్కుప్రశ్నలా కనపిస్తారు
 • గృహ అలంకరణ, విందు వినోదాలంటే వీరికి భలే ఇష్టం, మంచి భోజన ప్రియులు కూడా
 • జూన్ లో పుట్టినవారి జీవితంలో అనుకోకుండా కష్టాలొస్తాయి కానీ...అవి వీరిని ఏమీ చేయలేవు. ఎంతపెద్ద కష్టం నుంచి అయినా బయటపడే మార్గాలు  వీరు సమర్థులు
 • వీరి మైండ్ ఎప్పుడూ ఆలోచనలతో నిండిఉంటుంది. ఎవ్వరికి ఎలాంటి సలహా కావాల్సినా జూన్ లో పుట్టినవారిని అడిగితే ఠక్కున చెబుతారు
 • మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంటుంది, ట్రెండ్ కి తగ్గట్టు తమని తాము మలుచుకుంటారు
 • బయటకు ఎలా కనిపించినా కానీ తమ మనసులో భావాలను బయటకు తెలియనివ్వరు
 • ఏ పని చేసినా ఉత్తమ ఫలితాలు ఆశిస్తారు..అందుకే తరచూ వీరికి ఎవరో ఒకరితో వివాదాలు జరుగుతూనే ఉంటాయి
 • జూన్ లో పుట్టినవారు తమ అభిప్రాయాలను కుండబద్దల కొట్టినట్టు చెప్పడంలో సమర్థులు

Also Read :మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

జూన్ లో పుట్టినవారి ఆరోగ్యం: ఈ నెలలో పుట్టినవారికి నీరసం, బలహీనత ఉంటుంది
జూన్ లో పుట్టినవారి  ఆర్థిక పరిస్థితి: స్వయం కృషితో డబ్బు సంపాదిస్తారు
జూన్ లో పుట్టినవారికి కలిసొచ్చే వారాలు: ఆదివారం, బుధవారం
జూన్ లో పుట్టినవారికి కలిసొచ్చే రంగులు: పసుపు, ఆకుపచ్చ 

Note: గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.  ఇందులో పేర్కొన్న ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

Published at : 02 Jun 2023 07:08 AM (IST) Tags: Astrology Zodiac Months characteristics of june born June Astrology June Birthday Facts Personality and Traits Interesting Personality Traits Of June Born

ఇవి కూడా చూడండి

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

Horoscope Today September 23: ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Horoscope Today September 23: ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

టాప్ స్టోరీస్

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు