News
News
వీడియోలు ఆటలు
X

Astrology: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

Astrology: ఒకరి వ్యక్తిత్వం…వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి, గ్రహస్థితి ఆధారంగా మాత్రమే కాదు...పుట్టిన నెల ఆధారంగా కూడా చెప్పొచ్చంటారు జ్యోతిష్యులు. మరి డిసెంబరులోో పుట్టినవారెలా ఉంటారంటే...

FOLLOW US: 
Share:

డిసెంబరులో పుట్టినవారు పుట్టుకతోనే టీచర్లు అన్నట్టుంటారు. తమ జ్ఞానాన్ని పంచుకుంటారు. ఎదుటివారు తప్పుగా ప్రవర్తించినప్పుడు వారిని వారు ఎలా మెరుగు పర్చుకోవాలో లేదా ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ఏం చేయాలో సూచిస్తారు. ఇదంతా యాజమాన్య ధోరణితో కాకుండా స్నేహభావంతో చెబుతారు. ఇంకా డిసెంబరులో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే...

  • ఈ నెలలో జన్మించిన వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు. ఎప్పుడూ న్యాయంగా, విశ్వసనీయంగా ఉండటానికి ప్రయత్నిస్తారు
  • వీరిపై ఏదీ, ఎవరూ కూడా ఎలాంటి ప్రభావం చూపించలేరు. ఒకవేళ వారు ఏదైనా తప్పు చేసినా అది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదై ఉంటుంది
  • డిసెంబరులో జన్మించిన వ్యక్తులు చాలా శక్తివంతంగా ఉంటారు, పనిపట్ల అంకిత భావంతో వ్యవహరిస్తారు. వీరికి మంచి నాయకత్వ లక్షణాలుంటాయి
  • వీరు చాలా తెలివైనవారు,  ఏ విషయాన్ని అయినా లోతుగా అధ్యయనం చేసేందుకు ఇష్టపడతారు
  • కొత్త వ్యక్తులను కలుస్తారు, వివిధ సంస్కృతులను తెలుసుకుంటారు. బోధించేందుకు ఎంత ఉత్సాహంగా ఉంటారో..నేర్చుకోవడంలోనూ అంతకుమించి అనిపిస్తారు
  • కష్టాలు, సమస్యలను ఎదుర్కొంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటినుంచి దూరంగా పారిపోరు
  • జీవితం నుంచి ఏం కోరుకుంటున్నారో, ప్రాధాన్యతలేంటో తెలుసు. వీరికి ప్రత్యేకమైన కోరికలంటూ ఉండవు. సంతోషం అంటే కుటుంబం, సన్నిహితులు, ప్రేమించినవారు..వీరి సామ్రాజ్యం ఇంతే. 
    డిసెంబరులో జన్మించిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడానికి ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు
  • వీరు కొన్ని నియమాలకు,నమ్మకాలకు కట్టుబడి ఉండడం వల్ల దాన్నుచి వీరిని బయటకు తీసుకురావడం చాలా కష్టం. అందుకే అందరి దృష్టిలో మెండివాళ్లుగా పేరుపడతారు. కానీ ఆ మొండితనంలో కూడా ఎలాంటి స్వార్థ్యం ఉండదు
  • డిసెంబరులో జన్మించినవారు నిజాయితీగా, న్యాయంగా,  విధేయులుగా ఉంటారు
  • డిసెంబరులో పుట్టినవారు మంచి విద్యావంతులు, దయగలవారు, బుద్ధిబలము, దైవభక్తి కలిగి ఉంటారు
  • వీరి ప్రవర్తన చాలా బావుంటుంది. బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు చేస్తారు, బాగా సంపాదిస్తారు, మంచి పేరు సంపాదించుకుంటారు, నలుగురిలో గౌరవంగా బతుకుతారు. 
    పట్టుదల ,కార్యదీక్ష కలిగి ఉంటారు, తలపెట్టిన పని పూర్తిచేస్తారు
  • వీరికి అదృష్టంతో పాటూ దైవసహాయం కూడా తోడుంటుంది, భక్తిమార్గాన్ని అవలంభిస్తారు, ధర్మకార్యాలు చేస్తారు, ప్రయాణాలమీద ఆసక్తి ఉంటుంది
  • ఈ నెలలో పుట్టినవారు మంచి ఉద్యోగాలు చేస్తారు, రాజకీయాల్లో రాణిస్తారు, వీరిలో కొందరు పండితులు, విద్యావంతులుగా ఉంటారు
  • చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. పనిపై భక్తి, శ్రద్ధ రెండూ ఉంటాయి..ఆ పని పూర్తయ్యేవరకూ మరో పని గురించి ఆలోచించరు
  • ఏకాగ్రత ఎక్కువ, బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది, ఎలాంటి విషయాన్ని అయినా సులభంగా గ్రహించగలరు , అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేస్తారు
  • వీరికి సహనం చాలా తక్కువ, నీతి నిజాయితీ, మాటపట్టింపు చాలా ఎక్కువ
  • కానీ కొన్ని పరిస్థితులకు తలవంచాలంటే బాధపడతారు
  • వ్యాపారాలు బాగా నిర్వహిస్తారు, స్వయంకృషిని సొంత తెలివితేటల్ని నమ్ముకుంటారు
  • వారి పనిని వారే స్వయంగా చేస్తారు, ఇతరులు చేస్తే వారికి నచ్చదు

Also Read: అక్టోబరులో పుట్టారా, మీరు సింహం లాంటోళ్లని మీకు తెలుసా!

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

Published at : 25 May 2022 10:12 AM (IST) Tags: Astrology Zodiac Months characteristics of December born

సంబంధిత కథనాలు

Friday Special: శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!

Friday Special: శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!

Chanakya Niti: చాణక్య నీతి - భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధ‌మే

Chanakya Niti: చాణక్య నీతి - భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధ‌మే

Bharani Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!

Bharani Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!

Love and Relationship Horoscope June 9: ఈ రాశివారు పాతప్రేమికులను కలుస్తారు

Love and Relationship Horoscope June 9: ఈ రాశివారు పాతప్రేమికులను కలుస్తారు

జూన్ 9 రాశిఫలాలు, ఈ రాశులవారికి సమయం అనుకూలంగా ఉంది తొందరపడకండి

జూన్ 9 రాశిఫలాలు, ఈ రాశులవారికి సమయం అనుకూలంగా ఉంది తొందరపడకండి

టాప్ స్టోరీస్

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్

Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్

Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలు భారత్‌లోనే, 3 దశాబ్దాల తరవాత సర్‌ప్రైజ్

Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలు భారత్‌లోనే, 3 దశాబ్దాల తరవాత సర్‌ప్రైజ్