మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!
Rasi Phalalu Today June 7th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
![మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది! Horoscope Today June 7, 2023 Check astrological prediction for Scorpio, Aries, Gemini, Leo and other zodiac signs in telugu మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/06/098155ca302dec0efc0dfcf02ab783401686044526234217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope Today 7th June 2023: జూన్ 7 బుధవారం మీ రాశిఫలితాలు
మేష రాశి
కొత్తగా చేపట్టిన పనులు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొత్త స్టార్టప్‌ని ప్లాన్ చేసే ఆలోచన చేయవచ్చు. తల్లిదండ్రుల నుంచి ముఖ్యమైన సలహాలు స్వీకరిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాలను సులభంగా పరిష్కరిస్తారు.
వృషభ రాశి
ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మంచిది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ మాటలు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది కానీ భాగస్వాముల నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. స్నేహితులు లేదా బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది.
మిథున రాశి
మీ కుటుంబ సభ్యులు మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అవసరమైన వస్తువులను సురక్షితంగా ఉంచండి. నిలిచిపోయిన పనుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. తంత్ర-మంత్ర , రహస్య అభ్యాసాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది.
Also Read: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే
కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈరోజు చాలా మంచి రోజు. బ్యాంకింగ్ ,మేనేజ్‌మెంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారులు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి.
సింహ రాశి
ఈ రాశి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితుడితో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవాలి. భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. అవసరమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు కీర్తిని పొందుతారు. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది.
కన్యా రాశి
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. చాలా కాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు తొలగుతాయి. ఆన్‌లైన్ వ్యాపారం లాభిస్తుంది. పరిశోధన పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి విజయాన్ని పొందవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు ఈ రాశివారు ఒత్తిడికి దూరంగా ఉండండి. సన్నిహితులు ఎవరైనా మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు. మీపై కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉంటుంది. తన మనసులోని విషయాలను ప్రియమైన వారితో పంచుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం అనవసరమైన ఖర్చులు చేయవలసి వస్తుంది. ఒకేసారి అనేక పనులు చేయవద్దు. పనికిరాని విషయాల్లో సమయాన్ని వృథా చేయకండి. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.
Also Read: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!
వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈ రోజు ధనలాభం ఉంటుంది. ప్రయాణాల్లో అజాగ్రత్తగా ఉండకండి. మీ లక్ష్యాల విషయంలో పట్టువదలకుండా ఉండాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. భౌతిక సుఖాలను అనుభవిస్తారు. రోజువారీ పనులు పూర్తి చేయడంలో జాప్యం చేయవద్దు. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
ధనుస్సు రాశి
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో మరింత కష్టపడాలి. జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళతారు. మీరు ప్రతికూల వ్యక్తుల సాంగత్యానికి దూరంగా ఉండాలి. విద్యార్థులు తమ చదువుపై చాలా శ్రద్ధ వహించాలి. ఆఫీస్‌లో నిలిచిపోయిన పనుల వల్ల సమస్య ఉంటుంది. ఇంటి నిర్వహణకు డబ్బు ఖర్చు అవుతుంది.
మకర రాశి
అనుకోని పెద్ద పనిని పూర్తిచేస్తారు. ఎవరితోనైనా సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. అనుకోకుండా విమర్శలకు గురవుతారు. అతిగా ఆలోచించడం వల్ల నష్టపోతారు. పెద్దలతో మీ అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఉద్యోగు సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. అనవసర వాదన పెట్టుకోవద్దు. షేర్ మార్కెట్ నుంచి ప్రయోజనం పొందుతారు.
కుంభ రాశి
ఈ రాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనుసు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల కొంచెం బాధగా ఉంటుంది. దానధర్మాలకు ధనం వెచ్చిస్తారు. ఏ పని చేయాలనే ఆసక్తి ఉండదు. ఏదైనా కొత్త పని కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అర్థవంతమైన పనులకు డబ్బు ఖర్చు చేస్తారు. సహోద్యోగులతో మనస్పర్థలు వస్తాయి
మీన రాశి
ఈ రాశి ఉద్యోగులు ఈ రోజు వాదనలకు దూరంగా ఉండడం మంచిది. పని తీరుని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించాలి. పిల్లల భవిష్యత్ గురించి ఆందోళన ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. అత్తమామల వైపునుంచి గౌరవం పొందుతారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరిగే అవకాశాలు ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)