News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips: ఇంటి నిర్మాణం చేపట్టేముందు వాస్తు చూసుకునేవారి సంఖ్య ఎక్కువే. అయితే ఇప్పుడంతా అపార్ట్ మెంట్ కల్చర్..మనకు నచ్చినట్టు నిర్మించుకోవడం కుదరదు. అయితే వాస్తుపరంగా ఎలా ఉందో మాత్రం చూసుకోవాలి..

FOLLOW US: 
Share:

Vastu Tips In Telugu: వాస్తు కొందరికి సెంటిమెంట్ మరికొందరికి ట్రాష్. అస్సలు పట్టించుకోనివారికి సమస్యే లేదు కానీ వాస్తుని విశ్వశించేవారు మాత్రం ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలిస్తారు. వాస్తు ప్రకారం ఇది సరికాదని తెలిస్తే చాలు ఎలాంటి మార్పులు చేర్పులైనా చేసేస్తారు. అయితే  ఇంటిని ఎవరికి వారే నిర్మించుకుంటే వాస్తు ప్రకారం అన్నీ సరిచూసుకుంటారు. కానీ ఇప్పుడంతా అపార్ట్ మెంట్ కల్చర్. రెడీ టూ ఆక్యుపై ఉన్నవే కొనుక్కుంటున్నారు. అయితే అందులో కూడా అంతో ఇంతో వాస్తు చూసుకుంటున్నారు. మీరు కొనుక్కునే ఇంటివరకూ వాస్తు సరే మరి మీ ఇంటి చుట్టూ, ఇంటిపైన వాటర్ ట్యాంకులు , సెల్లార్ లో ఏర్పాటు చేసే బోర్లు ఎక్కడున్నాయో చూసుకోవాలి. ఎందుకంటే గృహ నిర్మాణ సమయంలో  విధిగా పాటించవలసిన వాస్తు సూత్రాల్లో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణం కూడా ముఖ్యమైనది.

Also Read: వాస్తు ప్రకారం ఈ మూలలు పెరిగిన స్థలాలు అస్సలు కొనకూడదు

ఓవర్ హెడ్ ట్యాంక్ ఏ దిశగా ఉండాలి

  • ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ పడమర వైపు లేదా, నైఋతి మూలన ఉండేలా చూసుకోవాలి
  • ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ పై స్లాబ్‌కు రెండడుగుల ఎత్తులో నిర్మించుకోవాలి. పై స్లాబ్‌ను ఆనుకుని ఉండకూడదు
  • ఈశాన్యంలో వాటర్‌ ఉండటం వాస్తురీత్యా సమంజసమే అయినా ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ వంటి బరువుల్ని ఈశాన్యం వైపు ఉంచకూడదు
  • ఆగ్నేయ దిక్కులో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను ఎట్టి పరిస్ధితిలో నిర్మించరాదు..ఇది చాలా దుష్ప్రభావాలకు కారణం అవుతుంది.
  • పడమరదిక్కున ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను నిర్మించుకోవడం మంచిది
  • వాయువ్య దిశలో, బిల్డింగ్‌ పైన మధ్య భాగంలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ ఎట్టి పరిస్ధితుల్లో నిర్మించకూడదు

Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది

బావి లేదా బోర్‌ ఎక్కడుండావి

  • బావి, బోర్‌ ఏర్పరచుకునే సమయంలో వాస్తు నిబంధనలు విధిగా పాటించాలంటారు వాస్తు నిపుణులు. స్థలానికి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యంలోనే బావి కానీ బోర్‌కానీ ఉండాలన్నది వాస్తు నియమం
  • నీరు పడలేదు కదాని స్థలంలో వేరే చోట్ల బావి గాని, బోర్‌ కానీ త్రవ్వేయటం వాస్తుప్రకారం విరుద్ధమనే చెప్పాలి
  • ఉత్తర ఈశాన్యంలో బోర్‌ పడకపోతే ఉత్తర సరిహద్దును రెండు భాగాలుగా చేసి, బావి కానీ బోర్‌ కానీ తూర్పు దిక్కుకు ఆనుకుని ఉన్న సగంలో ఏర్పాటు చేసుకోవచ్చు
    ఉత్తర సరిహద్దుకు పడమర దిక్కువైపున ఉన్న అర్ధభాగంలో బావి, బోర్‌ నిర్మాణం జరగకూడదు
  • తూర్పు ఈశాన్యంలో నీరు పడని పక్షంలో తూర్పు సరిహద్దులు రెండుగా విభజించి, ఈశాన్య దిక్కును ఆనుకుని ఉన్న భాగంలో ఎక్కడైన బావి, బోర్‌లు త్రవ్వుకోవచ్చు
    తూర్పు ఆగ్నేయాన్ని ఆనుకుని ఉన్న అర్ధబాగంలో బావి, బోర్‌లు ఉండకుండా పూర్తి జాగ్రత్తపడాలి
  • తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం పడమర వాయువ్యం, పడమర నైఋతి, దక్షిణ నైఋతి, దక్షిణ ఆగ్నేయం, ఈ ప్రదేశాలలో బోర్‌ కానీ బావి కాని ఉండనే ఉండకూడదు.
  • నీరు పడ్డాయి కదా అని సౌకర్యం కోసం స్థలంలోని ఈ ప్రదేశాలలో బావి త్రవ్వడం బోర్‌ వేయడం చేస్తే ఆ ఇంట సుఖశాంతులు ఉండవు, దరిద్రం తిష్ట వేసుకుంటుంది. కుటంబ సభ్యుల మధ్య చికాకులు పెరిగిపోతాయి. ఆ ఇంట్లో ఉండేవారిని తీవ్ర అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.

Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.

Published at : 04 Jun 2023 03:55 PM (IST) Tags: vastu shastra vastu remedies vastu for home vastu tips in telugu vastu tips for water tank Best direction for Overhead Water Tank Best Vastu Tips at Home

ఇవి కూడా చూడండి

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Horoscope Today September 24th: ఈ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం అవుతారు, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

Horoscope Today September 23: ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Horoscope Today September 23:  ఈ రాశివారు మాటల్లో నియంత్రణ పాటించడం మంచిది,సెప్టెంబరు 23 రాశిఫలాలు

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

టాప్ స్టోరీస్

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి