జూన్ నెలలో ఈ రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలే



మేష రాశి వారికి జూన్ నెలల గ్రహసంచారం బావుంది. నెల ఆరంభంలో కొన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ద్వితీయార్థం బావుంటుంది. జూన్ ఆరంభంలో మీరు సహనంగా ఉండాలి. విచక్షణతో వ్యవహరించాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.



వృషభ రాశివారికి గడిచిన నెలకన్నా ఈనెల అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.



ఈ నెలలో మిథున రాశి వారి మాటకు తిరుగుండదు. ఆదాయం పెరుగుతుంది.వ్యవహారాలు కలిసొస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. కుటుంబంలో మీ పట్టు నిలుపుకుంటారు. పనిభారం అధికంగా ఉంటుంది.



కర్కాటక రాశి వారికి జూన్ నెల అనుకూల ఫలితాలు లేవు. జన్మంలో కుజుడి సంచారం వల్ల చీటికి మాటికి ఉద్రేకం ప్రదర్శిస్తారు. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. మీ మాటతీరే మీకు వ్యక్తులను దూరం చేస్తుంది. సంఘంలో అపకీర్తి, అవమానకర సంఘటనలు జరుగుతాయి.



సింహరాశివారికి ఈ నెల అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం, ఆరోగ్యం బావుంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ వహించాలి లేదంటే మీ విశ్వసనీయతను కోల్పోతారు.



కన్యా రాశివారికి జూన్ నెల కొంతవరకూ బాగానే ఉంది. చేయు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం బావుంటుంది. మానసిక స్థితి మెరుగుపడుంది. ఆశించిన విజయాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఈ నెల ప్రారంభంలో వృత్తి-వ్యాపారాలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు.



తులా రాశివారికి జూన్ నెల కొన్ని ఇబ్బందులు, ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవాలి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి



వృశ్చిక రాశివారికి జూన్ నెల మిశ్రమ ఫలితాలున్నాయి. అష్టమంలో రవి, బుధుడు సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. అకాల భోజనం చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మానసిక సమస్యలుంటాయి



ధనస్సు రాశివారికి జూన్ నెలలో అష్టమంలో కుజుడు, శుక్రుడు సంచరిస్తున్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అకాల భోజనం, శారీరక శ్రమ, ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయి.వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.



మకర రాశివారికి జూన్ నెల అనూకూలంగా ఉంటుంది. ఆరోగ్యం, ఆదాయం బావుంటుంది. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు లాభాన్నిస్తాయి...ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు ఏర్పడతాయి.



ఈ నెల ఈ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. ఆరంభంలో ఇబ్బందులున్నా ఆఖరి నిముషంలో పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు జూన్ నెల ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బావుంటుంది.



మీన రాశి వారికి జూన్ నెల బాగానే ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులు మంచి ఫలితాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదు. చిన్న చిన్న పొరపాట్లు మీకు మచ్చ తీసుకొస్తాయి జాగ్రత్త పడాలి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.



గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. Images Credit: Pixabay