జూన్ 5 నుంచి 11 ఈ వారం మీ రాశిఫలితం



మేష రాశి
ఈ వారం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వారం ప్రారంభంలో ఉద్యోగం, వృత్తిలో మంచి ఫలితాలను పొందుతారు. కార్యాలయంలో సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. ఈ వారం ఆరోగ్యం బాగానే ఉంటుంది.



వృషభ రాశి
ఈ వారం ఈ రాశివారు తమమాటతీరును నియంత్రించుకోవాలి. స్నేహితుల సమస్యలను పరిష్కరిస్తారు. ప్రేమ సంబంధాలు బావుంటాయి. ఇష్టానికి వ్యతిరేకంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ వారం అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది.



మిథున రాశి
మిథున రాశి వారికి ఈ వారం పనిలో విజయం లభిస్తుంది. కుటుంబం, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వారం చివర్లో శుభవార్త వింటారు. ఆహారం, దినచర్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బాధ్యతలు నిర్వహించడంలో సక్సెస్ అవుతారు.



కర్కాటక రాశి
ఈ వారం ప్రారంభంలో కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారులు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది.



సింహ రాశి
ఈ రాశివారు ఈ వారం వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. డబ్బు సంపాదించేందుకు మంచి అవకాశాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వివాహితుల జీవితంలో అపార్థాలు ఉండొచ్చు.



కన్యా రాశి
ఈ వారం ఈ రాశివారికి వ్యాపార రంగంలో పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త. ఈ నెలలో కుటుంబ జీవితం దెబ్బతింటుంది. ఇంట్లో ఏదో తెలియని గందరగోళం నెలకొంటుంది.



తులా రాశి
ఈ వారం తులారాశివారికి కొన్ని ఒడిదొడుకులు తప్పవు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి.



వృశ్చిక రాశి
ఈ వారంలో వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. కుటుంబ జీవితం బావుంటుంది.



ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందుతారు.ఈ వారంలో మీరు విదేశాల్లో కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.



మకర రాశి
ఈ వారం మకర రాశి వారికి లాభాలతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆర్థిక జీవితంలో ఏదైనా పెద్ద నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది.



కుంభ రాశి
ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..సంయమనం పాటించడం మంచిది. ఆరోగ్య పరంగా ఈ వారం మీకు కొన్ని ఒడిదొడుకులు ఉండొచ్చు.



మీన రాశి
ఈ రాశివారికి కెరీర్ పరంగా ఇది క్లిష్టమైన సమయం. ఈ సమయంలో ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో సంతోషం తగ్గుతుంది. వ్యాపారంపై మరింత శ్రద్ధ పెట్టాలి.



గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.