(Source: ECI/ABP News/ABP Majha)
చీపురు విషయంలో ఈ నియమాలు పాటించకపోతే దరిద్రం తప్పదు
చీపురును వాడే విషయంలో కొన్ని నియమాలు పాటిండం వల్ల ఇల్లు సమృద్ధిగా ఉంటుందట. అవేమిటో తెలుసుకుందాం.
అందరూ లక్ష్మీ కటాక్షం కోరుకుంటారు. అందుకు రకరకాల పూజలు చేస్తుంటారు. కానీ లక్ష్మీ కటాక్షానికి కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అలా చేసినపుడే లక్ష్మీ కాటాక్షం లభిస్తుంది. జ్యోతిషం, వాస్తు తో పాటు అనేక పురాణాల్లో లక్ష్మీ కటాక్షం కలిగి శ్రీమంతులు కావడానికి అనేక పరిహారాలను, ఉపాయాలను సూచించారు మన పెద్దలు.
కొన్ని రోజువారీ అలవాట్లు కూడా మన అభివృద్ధికి అవరోధంగా మారుతాయి. ఇంట్లోని కొన్ని వస్తువులు లక్ష్మీదేవికి సంబంధించినవిగా పరిగణిస్తారు. వాటిలో చీపురు ఒకటి. చీపురును ఇల్లు శుభ్రం చేసేందుకు వాడుతారు. చీపురు విషయంలో ఉండే నియమాలు తెలుసుకుందాం.
ఇల్లు ఎప్పుడు ఊడ్చాలి?
సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చీపురు వినియోగించకూడదు. సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందే ఇల్లూవాకిలి శుభ్రం చేసుకోవాలి. చీకటి పడిన తర్వాత ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి కోపగించుకుంటుందట. ఫలితంగా ఇల్లు దరిద్రం తాండవిస్తుంది. అందుకే సూర్యాస్తమయానికి ముందే ఇల్లు శుభ్రం చేసుకోవాలి.
ఇల్లు ఉడ్చేందుకు నియమాలు
ఇంట్లోంచి ఎవరైనా బయటికి వెళ్తున్నపుడు లేదా వాళ్లు వెల్లిన వెంటనే ఇల్లు ఊడ్చకూడదు. ఇలా చేస్తే వారు వెళ్లిన పని జరగదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా బయటికి వెళ్లే వారు వాళ్ల గది నుంచి బయటికి వచ్చిన తర్వాత చీపురు అసలు వాడకూడదు.
చీపురు ఇక్కడ పెట్టకూడదు
బయటి వ్యక్తుల చూపు పడని చోట చీపురు దాచి ఉంచాలి. తులసికోట, పూజగది, డబ్బుదాచే చోట చీపురు ఉంచకూడదు. చీపురు వీటికి దగ్గరగా పెడితే ఇంట్లోకి రావల్సిన ధనం రాదు.
ఏ దిక్కున ఉంచాలి
చీపురును ఎప్పుడూ కాలితో తాకకూడదు. పొరపాటున కాలు తగిలిన చేతులు జోడించి క్షమాపణ అడగాలి. చీపురు ఇంట్లో వాయవ్యంలో లేదా పడమర దిక్కున దాచి ఉంచాలి. ఈశాన్యం, ఆగ్నేయంలో చీపురును ఉంచకూడదు. ఇల్లు ఊడ్చే సమయంలో శివాయ నమ: అని భగవన్నామ స్మరణతో ప్రారంభిస్తే శనేశ్చరుడు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడని నమ్మకం.
చీపురు ఎప్పుడు కొనాలి?
పాతదైన చీపురు బయట పడేసేందుకైనా, కొత్త చీపురు ఇంటికి తెచ్చుకునేందుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. పాత చీపురు తీసేసి కొత్త చీపురు వాడడానికి శనివారం మంచిది. కృష్ణ పక్షంలో చీపురు కొనడం మంచిది. మంగళ వారం, శుక్రవారం, మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండే రోజుల్లో కొత్త చీపురు కొని ఇంటికి తీసుకురావద్దు.
పాత చీపురు ఎప్పుడు పడెయ్యాలి?
పండగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టిన రోజున ఇంట్లోని పాత చీపురు బయట పడెయ్యకూడదు. రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో కూడా చీపురు కొన కూడదు. పాత చీపురు తీసెయ్య కూడదు. సోమ వారం, బుధవారం, గురువారం, ఆదివారం మాతరమే పడెయ్యాలి. మంగళ, శుక్ర, శనివారాల్లో పాత చీపురు పడెయ్యకూడదు.
Also read : Dreams: కాళ్లను పట్టుకున్నట్లు కల వచ్చిందా? అయితే, జరిగేది ఇదే!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial