News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Rudraksha : ఈ ముఖి రుద్రాక్ష ధరిస్తే ఐశ్వర్యం-అదృష్టం.. ఈ ముఖి రుద్రాక్ష వేసుకుంటే మృత్యుదోషం పోతుందట...

ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా రుద్రాక్షకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎక్కువగా పంచముఖి రుద్రాక్షలు వేసుకుంటుంటారు. అయితే ఏకముఖి నుంచి ఏకాదశ ముఖి వరకూ ఏముఖి రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి ఫలితమో ఇక్కడ తెలుసుకోండి.

FOLLOW US: 
Share:

రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. రుద్రాక్షలు అనేవి శివుని కంటి నుంచి జాలువారిన బిందువులు. రుద్రాక్షలు వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీ పురాణం, పద్మ పురాణంలో ప్రధానంగా చర్చించారు. మరి ఎవరు ఏముఖి రుద్రాక్ష ధరించాలో తెలుసా..

ఏ రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి ఫలితం

  • ఏకముఖి రుద్రాక్ష చాలా విలువైనది. ఎలాంటి మంత్ర తంత్ర ప్రయోగాలను అయినా తిప్పి కొట్టగలదు. దీన్ని ధరించడం వల్ల సిరి సంపదలు, శిరో సంబంధ రోగాలు తగ్గుతాయి.
  • ద్విముఖి రుద్రాక్షను బ్రహ్మ రుద్రాక్ష అని అంటారు కొందరంటే... అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని మరికొందరు చెబుతారు. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని చెబుతారు. మానసిక సమస్యను దూరం చేస్తుంది.
  • త్రిముఖి రుద్రాక్ష అదృష్టం,ఐశ్వర్యం కలిసొచ్చేలా చేస్తుందని విశ్వాసం.  త్రిముఖి ధరించే కామెర్ల వ్యాధి తగ్గుతుందని,  సర్ప దోష నివారణ అవుతుందని చెబుతారు.
  • చతుర్ముఖి రుద్రాక్ష ధరించేవారు ఏ రంగంలో అయినా రాణిస్తారట. అంతేకాదు..చదువు, ఉద్యోగంలో పనిపై ఏకాగ్రత పెరుగుతుందట.
  • పంచముఖి  రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండె సంబంధిత వ్యాధులు నివారణ అవుతాయట.

Also Read: రుద్రాక్ష చెట్టు ఇంట్లోనే పెంచుకోవచ్చు…ఎలాగో తెలుసా?

  • షణ్ముఖి రుద్రాక్ష కుమార స్వామి స్వరూపం. దీన్ని ధరిస్తే శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభిస్తుందట.
  • సప్త ముఖి రుద్రాక్ష వల్ల సంపద, కీర్తి, ఉత్తేజం కలుగుతాయట.
  • అష్ట ముఖి రుద్రాక్ష ధరించిన వాపిరివ ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుందట..
  • నవముఖి రుద్రాక్ష భైరవ స్వరూపమైనది. రాజకీయాల్లో ఉన్నక స్థానాన్ని ఆశించేవారికి , అపమృత్యు నివారణ దోషాలు తగ్గించేందుకు నవముఖి రుద్రాక్ష పనికొస్తుందట.
  • దశముఖి రుద్రాక్ష దశావతారాలెత్తిన విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఈ రుద్రాక్ష  గొంతు సంబంధ రోగాలను, నవగ్రహాల ద్వారా కలుగే కష్టాలు, సమస్యలు నివారణ అవుతాయట.
  • ఏకాదశ ముఖి ఇది శివాత్మకమయిన రుద్రాక్ష. వైవాహిక జీవితంలో ఆనందం ఉండడంతో పాటూ, గర్భ సంబంధ రోగాలు నయమవుతాయట. 

ఏ రుద్రాక్ష వేసుకున్నా సత్ఫలితాలనే ఇస్తుందని చెబుతారు పండితులు. అయితే మీ పరిస్థితిని బట్టి ఏ ముఖి రుద్రాక్ష ధరించాలో తెలుసుకోవాలంటారు. అసలు రుద్రాక్షపై నమ్మకమే లేనివారికి ఎలాంటి పట్టింపు లేదు. 

Also Read: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Jan 2022 01:59 PM (IST) Tags: rudraksha rudraksha benefits rudraksha mala rudraksham sadhguru rudraksha rudraksh benefits of rudraksha rudraksha diksha ek mukhi rudraksha rudraksha tree rudrasksha rudraksha testing rudraksha water testing rudraksha test how to test a rudraksha water rudraksha beads 7 mukhi rudraksha types of rudraksha power of rudraksha original rudraksha how to wear rudraksha

ఇవి కూడా చూడండి

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Chanakya Niti In Telugu : భర్త అనుమ‌తి లేకుండా భార్య వెళ్ల‌కూడ‌ని 4 ప్రదేశాలు ఇవే!

Chanakya Niti In Telugu : భర్త అనుమ‌తి లేకుండా భార్య వెళ్ల‌కూడ‌ని 4 ప్రదేశాలు ఇవే!

Spirituality: రంగనాథుడు కొలువైన ఈ 5 క్షేత్రాలు చాలా ప్రత్యేకం- మీరెన్ని దర్శించుకున్నారు!

Spirituality:  రంగనాథుడు కొలువైన ఈ 5 క్షేత్రాలు చాలా ప్రత్యేకం- మీరెన్ని దర్శించుకున్నారు!

Horoscope Today: ఈ రాశులవారికి అభివృద్ధి - ఆదాయం, సెప్టెంబరు 21 రాశిఫలాలు

Horoscope Today:  ఈ రాశులవారికి అభివృద్ధి - ఆదాయం, సెప్టెంబరు 21 రాశిఫలాలు

Spirituality: ఈ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కుటుంబ వృద్ధి, శత్రునాశనం!

Spirituality:  ఈ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కుటుంబ వృద్ధి, శత్రునాశనం!

టాప్ స్టోరీస్

Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా

Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా

AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !

AP News  :  పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ