Puri Rath Yatra 2025: పహల్గాం ఎఫెక్ట్.. పూరీ జగన్నాథుని రథయాత్రకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు!
Puri Rath Yatra 2025 Security Arrangements: పూరీ జగన్నాథుడి రథయాత్ర ఆరంభమైంది..మొదటి రెండు రోజుల్లోనే 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనామేరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు

Puri Rath Yatra Begins: ఒడిశాలో పూరీ జగన్నాథుడి రథయాత్ర సందడి ఉదయం నుంచి ప్రారంభమైంది. అత్యంత వైభవంగా జరిగే ఈ యాత్రను కళ్లారా చూసేందుకు దేశ, విదేశాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తారు. రథయాత్రను నేరుగా దర్శించుకుంటే మంచి జరుగుతుందని, పాపాలు నశిస్తాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర రథాలను లాగుతారు. ఈ మగ్గురూ ముందుగా గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉన్నతర్వాత తిరిగి జూలై 8 న తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. కన్నులపండువగా జరిగే ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు 15 లక్షల మంది భక్తులు జగన్నాథుడిని దర్శించుకుంటారు. ఈ మేరకు ఎలాంటి అపశ్రుతులు జరగకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు అధికారులు
రథయాత్ర కోసం ఏర్పాటు చేసిన 10 వేల మంది భద్రతా సిబ్బందిలో ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. పూరీ పట్టణం వ్యాప్తంగా 250కి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబెల్డ్ కెమెరాలు పెట్టారు. ఈ మధ్య పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన ఘటనల దృష్ట్యా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఒడిశా DGP వైబీ ఖురాని చెప్పారు. పూరీలో ఫస్ట్ టైమ్ ఈ ఏడాది ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉత్తరా చెక్-పూరీ పట్టణాల మధ్య, పూరి-కోణార్క్ మార్గాల్లోనూ 250కి పైగా ఏఐ-ఎనేబుల్డ్ సీసీటీవీ కెమెరాలను అమర్చి ట్రాఫిక్ కదలికను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు ఒడిశా డీజీపీ. ఇంకా డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది, యాంటీ-సాబోటేజ్ బృందాలు, బాంబ్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లను కూడా వినియోగిస్తున్నారు. రథయాత్ర సందర్భంగా ఒడిశాలోని సముద్రతీరంలోనూ భద్రతను మరింత పెంచారు. ఒడిశా మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్లు సహా భారత నావికాదళం కూడా రంగంలోకి దిగిందని డీజీపీ చెప్పారు. పార్కింగ్స్, రూట్ మ్యాప్స్ గురించి భక్తులకు తెలియజేసేలా రియల్ టైమ్ చాట్‌బాట్ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
రథయాత్రలో భాగంగా భక్తులను నేరుగా అనుగ్రహించేందుకు ఆలయం నుంచి బయటకు తరలివస్తాడు. అంటే స్వర్గం నుంచి భగవంతుడు భూమ్మీదకు వస్తాడని దీనివెనుకున్న ఆంతర్యం. జాతి, మతం, కులం, సామాజిక స్థాయితో సంబంధం లేకుండా అందర్నీ ఓ చోట చేర్చే సమానత్వాన్ని, ఐక్యతను సూచిస్తుంది రథయాత్ర. రథయాత్ర ప్రారంభానికి ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథం ముందు శుభ్రం చేయడం కూడా ఇందులో భాగమే. స్కాంద పురాణం ప్రకారం రథయాత్రలో పాల్గొనే భక్తులకు పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.
జగన్నాథ రథయాత్ర వెనుక రహస్యం.. సగం చెక్కిన విగ్రహాల కథ, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఇది...పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Jagannath Rath Yatra 2025 : పూరీ జగన్నాథ రథయాత్ర పూర్తి షెడ్యూల్ ..ఆ 10 రోజుల్లో ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















