Jagannath Rath Yatra 2025: జగన్నాథ రథ యాత్ర ప్రారంభం .. ఈ రోజు షెడ్యూల్ ఇదే!
Rath Yatra Programme Schedule: జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి రథయాత్ర ప్రారంభం వరకూ ఏఏ కార్యక్రమాలు జరుగుతాయి.

Rath Yatra 2025: జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి రథయాత్ర ప్రారంభం వరకూ ఏఏ కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పూరీ రథయాత్ర సందడి ఈరోజు (జూన్ 27) ఘనంగా మొదలైంది. భారీగా భక్తులతో పూరీ వీధులు కిక్కిరిసిపోయాయి. రథయాత్రలో భాగంగా జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలసి భక్తజనం మధ్యకు గర్భగుడి నుంచి తరలిరానున్నాడు. భక్తి, ఐక్యత, సాంస్కృతి వైభవాన్ని సూచించే ఈ ఉత్సవానికి సంబంధించి ఈ రోజు షెడ్యూల్ ఇదే..
జూన్ 27 రథయాత్ర షెడ్యూల్
ఉదయం 6:00 గంటలకు మంగళ హారతితో ప్రారంభించారు. ఉదయ 6:10 కి మైలం ...ఆ తర్వాత తడపలాగి, రోష్ హోమం, అబకాష్, సూర్య పూజ, ద్వారపాలపూజ, గోపాల బల్లవ్, ఉదయ ధూప ఖేచడి భోగ్ ఉంటుంది. తొమ్మిదింపావ్ కి మంగళార్పణం నిర్వహించారు. అప్పుడు పహండి ప్రారంభించారు
పహండి తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నవరకు
పహండి అనేది గర్భగుడిలో కొలువైన స్వామివారిని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం. ఇది తొమ్మిదిన్నరకు ప్రారంభమై 12న్నరకు పూర్తవుతుంది. ఆ తర్వాత చితా లాగి, వేషం ముగింపు ఉంటుంది.
మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు "చెహరా పహారా"
చెహరా పహారా అనేది రథయాత్ర సమయంలో నిర్వహించే ఆచారం. ఇది రథయాత్రలో ముఖ్యమైన ఆచారం. చెహరా పహారా అంటే ఒరియాలో ఊడ్చటం అని అర్థం. జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథాల ముందు పూరీ రాజు బంగారుచీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత రథం లాగడం ప్రారంభమవుతుంది
రథం లాగడం ప్రారంభసమయం 4 గంటలు
రథం ఆరంభంలో ఎంతమంది పట్టుకుని లాగినా కదలదు..కానీ ఒక్కసారి కదిలిన తర్వాత ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోతుంది
రథయాత్రకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇవే
ఏప్రిల్ 30 అక్షయ తృతీయ రోజు రథాల నిర్మాణం ప్రారంభమైంది
జూన్ 11 దేవతలకు స్నానయాత్ర
జూన్ 13 స్నానం తర్వాత భగవంతుడికి అనవసర నిర్వహించారు
జూన్ 26 రథయాత్రకు ముందు రోజు గుండిచా ఆలయాన్ని శుభ్రం చేస్తారు
జూన్ 27 రథయాత్ర ప్రారంభం
జూలై 1 గుండిచా ఆలయంలో ఐదో రోజు శ్రీ మహాలక్ష్మి జగన్నాథుడిని కలిసేందుకు వస్తుంది
జూలై 5 బహుదా యాత్ర..జగన్నాథుడు తిరిగి ఆలయానికి వస్తాడు
జూలై 6 సునా బేష..దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు
జూలై 8 గర్భగుడిలోకి స్వామివారి ప్రవేశం
250 మంది కార్మికులు 57 రోజుల పాటు రథాలను సిద్ధం చేశారు
నందిఘోష్‌గా ప్రసిద్ధి చెందిన జగన్నాథుని రథం ఈ మూడింటిలో అత్యంత బరువైనది. జగన్నాథుని రథం దాదాపు 280-300 టన్నుల బరువు ఉంటుంది. నందిఘోష్ 45.6 అడుగుల ఎత్తు 16 చక్రాలు కలిగి ఉంటుంది
బలభద్రుని రథం తాలధ్వజుడు సుమారు 250 టన్నుల బరువుంటుంది..ఇది 5 అడుగుల ఎత్తు 14 చక్రాలు కలిగి ఉంటుంది
సుభద్ర రథం సుమారు 200 టన్నుల బరువు ఉంటుంది.. ఇది 44.6 అడుగుల ఎత్తు 12 చక్రాలు కలిగి ఉంటుంది
మూడు రథాలను నిర్మించడానికి దాదాపు 10,800 క్యూబిక్ అడుగుల కలపను ఉపయోగిస్తారు.
జగన్నాథ రథయాత్ర వెనుక రహస్యం.. సగం చెక్కిన విగ్రహాల కథ, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఇది...పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Jagannath Rath Yatra 2025 : పూరీ జగన్నాథ రథయాత్ర పూర్తి షెడ్యూల్ ..ఆ 10 రోజుల్లో ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి























