మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 9 నమ్మశక్యం కాని విషయాలు
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలు ఇక్కడ అసంపూర్ణంగా ఉంటాయి
జగన్నాథ దేవాలయ ధ్వజం ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇక్కడ ఇదో అంతుచిక్కని రహస్యం
ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఎంపిక చేసిన చెట్లను ఉపయోగించి కొత్త రథాలు తయారు చేస్తారు.. ఈ ప్రక్రియలో ఒక్క మేకును కూడా ఉపయోగించరు.
ప్రతిరోజు జెండా మార్చే కార్యక్రమం ఒక పూజారి నిర్వహిస్తారు.. ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా గుడి గోపురం ఎక్కి జెండా కడతారు
ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తారు. ఈ సమయంలో బ్రహ్మ పదార్థాన్ని రాత్రి సమయంలో రహస్యంగా మారుస్తారు.
ఈ ఆలయ వంటశాల ప్రపంచంలోనే అతి పెద్దది. మహాప్రసాదం పరిమాణం రోజురోజుకూ మారుతూ ఉంటుంది, ఎప్పుడూ వృధా కాదు.
ఆలయం పైభాగంలో సుదర్శన చక్రం ఉంది. సూర్యుడు ఏ స్థానంలో ఉన్నా ఈ చక్రం నీడ నేలపై పడదు
విశ్వానికి ప్రభువు అయిన జగన్నాథుడు ఏడాదికి ఓసారి రథయాత్ర సమయంలో గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ వారు 9 రోజులు ఉంటారు.
చక్రం నీడ మాత్రమే కాదు ఆలయం నీడ కూడా కనిపించదు. కొందరు ఇది నిర్మాణ రూపకల్పన అని మరికొందరు ఇది జగన్నాథుడి మాయ అంటారు