Old Yadagirigutta Brahmotsavalu: పాత యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం - 10న కల్యాణం 13న ఘటాభిషేకంతో ముగింపు!
Yadagirigutta Brahmotsavalu:పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు (ఫిబ్రవరి 07) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 13 వరకూ వైభవంగా జరగనున్నాయి..ఈ రోజు ఏ సేవ అంటే..

Old Yadagirigutta Brahmotsavalu: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 13 వరకూ వారం రోజుల పాటు వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా వారం రోజుల పాటు నిత్యం ఉదయం, సాయంత్రం స్వామివారికి అలంకార సేవలు నిర్వహిస్తారు.
Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏ రోజు ఏ వాహన సేవలంటే..
@ ఫిబ్రవరి 07 ఉదయం వేద పండితులు స్వస్తివాచనం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురారోపణం, మృత్సంగ్రహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
@ ఫిబ్రవరి 09 ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి సింహవాహన సేవ నిర్వహిస్తారు.. రాత్రి అశ్వవాహన సేవలో ఎదుర్కోళ్లోత్సవం
@ ఫిబ్రవరి 10 సోమవారం ఉదయం హనుమంత సేవ, రాత్రి గజవాహన సేవలో తిరుకల్యాణోత్సవం
@ ఫిబ్రవరి 11 మంగళవారం ఉదయం గరుడ వాహనసేవ...రాత్రి రథాంగ హోమం, దివ్య విమాన రథత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు లక్ష్మీ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు.
@ ఫిబ్రవరి 12 బుధవారం చక్రతీర్థం, మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు
@ ఫిబ్రవరి 13 గురువారం అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి
@ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 10 సోమవారం రాత్రి నిర్వహించే స్వామివారి కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం టికెట్లు విక్రయిస్తున్నారు. కళ్యాణ టికెట్ ధర ఒక్కొక్కటి రూ.600గా నిర్ణయించారు.
@ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
@ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.
@ పాతగుట్టలో వారం పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలుకు భారీగా భక్తులు హాజరుకానున్నారు
Also Read: భీష్మ ఏకాదశి ఎప్పుడు..ప్రాముఖ్యత ఏంటి - ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం ఏంటి!
శ్రీ ఋణమోచన నృసింహ స్తోత్రం (Runa Vimochana Narasimha Stotram)
ధ్యానమ్ –
వాగీశా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి |
యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే ||
అథ స్తోత్రమ్ –
దేవతాకార్యసిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ||
లక్ష్మ్యాలింగిత వామాంకం భక్తానాం వరదాయకమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ||
ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ||
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ||
సింహనాదేన మహతా దిగ్విదిగ్భయనాశనమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ||
ప్రహ్లాదవరద శ్రీశం దైత్యేశ్వరవిదారణమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ||
క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ||
వేదవేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ||
ఇత్థం యః పఠతే నిత్యం ఋణమోచన సిద్ధయే |
అనృణో జాయతే శీఘ్రం ధనం విపులమాప్నుయాత్ ||
సర్వసిద్ధిప్రదం నృణాం సర్వైశ్వర్యప్రదాయకమ్ |
తస్మాత్ సర్వప్రయత్నేన పఠేత్ స్తోత్రమిదం సదా ||
ఇతి శ్రీనృసింహపురాణే ఋణమోచన శ్రీ నృసింహ స్తోత్రమ్ |
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!






















