Monthly Horoscope September 2022: ఈ రాశులవారికి శాంతి, ఆ రాశులవారికి అశాంతి- సెప్టెంబరు నెల రాశిఫలాలు!
Monthly Horoscope September 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి
Monthly Horoscope September 2022: సెప్టెంబరు నెలలో మేషం నుంచి మీనం వరకూ ఏ రాశివారికి ఎలా ఉందో చూద్దాం...
మేషం
మేష రాశి వారు సెప్టెంబర్ నెలలో ప్రతి పనిని ఓపికగా చేయవలసి ఉంటుంది. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రతికూల ఆలోచనలు మీ మనస్సులోకి ప్రవేశించనివ్వవద్దు. మనోధైర్యం తగ్గుతుంది. చంచల మనసత్త్వం ,సోమరితనం మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది.
వృషభం
ఈ నెల ఈ రాశివారికి కుటుంబంలో తరచూ కలహాలుంటాయి. భార్య-భర్త మధ్య అన్యోన్యత లోపిస్తుంది. రావాల్సిన బాకీలు వసూలు కావు..ఇవ్వాల్సినవి మాత్రం తప్పదు.ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీరు మానసికంగా దృఢంగా తయారవుతారు.
మిథునం
ఈ నెల మిథునరాశివారికి పిత్రార్జిత ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది. బంధువులను, స్నేహితులను కలుస్తారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఈ మాసం మీకు జీవితంలో చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
Also Read: వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది!
కర్కాటకం
కర్కాటక రాశివారిని ఈనెల చర్మ వ్యాధులు ఇబ్బంది పెడతాయి. అనుకున్న పనులు పూర్తికావు..ఖర్చులు పెరుగుతాయి. మీ కింద పనిచేసేవారివలన మాటలు పడతారు. నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తారు. ఎప్పటినుంచో చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. కళలు,సాహిత్యంపై ఆసక్తి పెరుగుతుంది. కెరీర్‌లో మార్పు చేయాలనే ఆలోచన రావచ్చు.
సింహం
మీ మాటలను అదుపులో ఉంచుకోండి. బంధుమిత్రులతో కలహాలు సూచనలున్నాయి. శారీరకంగా ఏదో తెలియని బాధ వెంటాడుతుంది.అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సింహ రాశి విద్యార్థులు విద్యలో సక్సెస్ అవుతారు. వ్యాపారులకు శుభసమయం. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు శుభవార్త వింటారు.
కన్యా
ఈ నెలలో ఈ రాశి ఉద్యోగులకు స్థానచలనం ఉండొచ్చు. బంధువర్గంతో అనుకోకుండా విరోధాలు జరుగుతాయి మాట తూలొద్దు. నమ్మినవారివలన మోసపోతారు. పనుల్లో ఆటంకాలు, ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. కోపం పెరుగుతుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి యోగా, ధ్యానంపై దృష్టి పెట్టండి. ఈ నెలలో మీరు ఎన్నో సవాళ్లతో కూడిన పనులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్ధుల మనస్సు చదువుపై నుంచి చలించవచ్చు.
తుల
ఈ నెల తులారాశివారికి అనుకూల ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యం బావుంటుంది. పాతబాకీలు వసూలవుతాయి. ధనలాభం, కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సెప్టెంబరు చివరి వారంలో చాలా పెద్ద ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
Also Read: బానపొట్ట, పెద్ద చెవులు, చిన్న కళ్లు -వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!
వృశ్చికం
ఈ నెల వృశ్చికరాశివారికి మంచి జరుగుతుంది. అవివాహితులకు ఈనెలలో వివాహ ప్రతిపాదన రావొచ్చు. రాజకీయ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇతరులతో వ్యవహరించడంలో కొంత సున్నితత్వం ఉండాలి. కుటుంబ సభ్యులతో కొంత దూరంగా ఉండడం వల్ల జీవిత భాగస్వామితో సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి.
ధనుస్సు
ఈ నెలలో మీరు మీ కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అకారణ కలహాలు, తండ్రికి అనారోగ్యం సూచనలున్నాయి. ఏ పని చేసినా లాభనష్టాలు సమానంగా ఉంటాయి. వ్యాపారులు లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. వైవాహిక జీవితం బావుంటుంది.
మకరం
మకర రాశి వారికి ఈ మాసంలో నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు ఎదురుకావచ్చు. ఓ దుర్వార్త వినాల్సి వస్తుంది. కుటుంబ జీవితంలో కలహాలుంటాయి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. అపనిందలు, అనారోగ్యం, స్త్రీలతో విరోధాలు, అజీర్ణవ్యాధి..ఇలా ఈ నెల మకరరాశివారికి అస్సలు బాలేదు.
కుంభం
ఈ నెల ఈ రాశివారి జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలున్నాయి. మాట పట్టింపులుంటాయి. గతంలో కన్నా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో సమయం గడిపే అవకాశం లభిస్తుంది.ప్రభుత్వాధికారుల వల్ల లాభపడతారు. మీ గౌరవం పెరుగుతుంది.
మీనం
మీన రాశి వారికి సెప్టెంబర్ నెల అద్భుతంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది. పై అధికారులతో స్నేహలాభం. పెద్దల సలహాలు లేకుండా ఏ నిర్ణయం తీసుకోపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.