శరీరంలో ఈ ఏడు చక్రాలు చాలా కీలకం



మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః



1. మూలాధారచక్రం
ఈ చక్రం మలరంధ్రానికి రెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎర్రగా ఉంటుంది. నాలుగురేకులుగల తామరపువ్వు ఆకారంలో ఉండే ఈ చక్రానికి అధిపతి వినాయకుడు



2. స్వాధిష్ఠాన చక్రం
ఇది జననేంద్రియం వెనుక భాగంలో ఉన్న వెన్నెముకలో ఉంటుంది. అధిపతి బ్రహ్మతత్త్వం, వాహనం మకరం. సింధూరవర్ణంలో ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది.



3. మణిపూరక చక్రం
బొడ్డుకు మూలంలో వెన్నెముక దగ్గర ఉంటుంది.ఈ చక్రం అధిపతి శ్రీ మహావిష్ణువు. వాహనం కప్ప. ఈ చక్రం పదిరేకుల పద్మాకారంలో బంగారపు వర్ణంతో ఉంటుంది.



4. అనాహత చక్రం
ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికి అధిదేవత రుద్రుడు. నీలం రంగులో పన్నేండు రేకుల తామరపూవులా ఉంటుంది. వాయుతత్వం అయిన ఈచక్రానికి వాహనం లేడి.



5. విశుద్ధచక్రం
ఇది కంఠం దగ్గరుంటుంది. దీనికి అధిపతి జీవుడు. ఆకాశతత్వం అయిన ఈచక్రం నలుపు రంగులో ఉంటుంది. వాహనం ఏనుగు.



6. ఆజ్ఞాచక్రం
ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీనికి అధిపతి ఈశ్వరుడు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉండే ఈ చక్రం తెలుపురంగులో ఉంటుంది.



7. సహస్రారం
ఇది కపాలం పై భాగంలో ఉంటుంది. మనం మాడు అని పిలిచే చోట అన్నమాట. దీన్నే బ్రహ్మరంధ్రం అంటారు. దీనికి అధిపతి కూడా శివుడే.