గుండె పోటు బారిన పడకుండా మార్గాలు ఇవిగో గుండెపోటు, కార్డియాక్ అరెస్టు, అధిక కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, కరోనరీ ఆర్డరీ డిసీజ్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్... ఇవన్నీ గుండె సంబంధ వ్యాధుల జాబితా. ఇవి ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. మాకు రావులే అనే ధీమా పనికిరాదు. వీటిని అడ్డుకునే మార్గాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. పొగాకు ధమనులను సంకోచించేలా చేస్తుంది. దీని వల్ల రక్తప్రసరణ సరిగా అందదు. ఇలా ఎక్కువకాలం కొనసాగితే గుండె పోటు వంటి ప్రమాదం పెరుగుతుంది. మీరెంతగా శారీరక శ్రమకు దూరంగా ఉంటే గుండె జబ్బులకు అంతగా దగ్గరవుతున్నట్టు లెక్క. గుండె ఆరోగ్యానికి సమతులాహారం చాలా ముఖ్యం. నట్స్, దేశీ నెయ్యి, తాజా పండ్లు, కూరగాయలు రోజూ తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. డైట్ ఫ్యాడ్‌లు ఫాలో అవడం మానండి. అధిక రక్తపోటు దీర్ఘకాలం ఉంటే గుండెపోటుగా మారుతుంది. అందుకే ఉప్పును తగ్గించాలి.