మేషం ఉద్యోగులుకు కాస్త కష్టంగానే ఉంటుంది. . కొత్త ఉద్యోగం మారాలి అనుకున్న వారికి ఇదే మంచి సమయం. అనారోగ్యం కారణంగా చికిత్సకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉద్యోగంలో అనేక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి అనుభవజ్ఞుల సహవాసం నుంచి ప్రయోజనం పొందుతారు.
వృషభం పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ రోజు బాధ్యతల నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. సమాజానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి.
మిథునం మీ గుర్తింపు పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం పెద్దల సలహాలు పాటించండి. ఉద్యోగంలో మార్పులు చేసుకోవచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఈ రోజు మంచిరోజు.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటకం కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకున్నవారికి మంచిరోజు. ఈరోజు కార్యాలయంలో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అధికారులతో సమావేశమవుతారు. బంధువుల స్థలంలో శుభ కార్యాలు నిర్వహిస్తారు. డబ్బు పరిస్థితి బాగానే ఉంటుంది.
సింహం ఈరోజు మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దు. తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు ఎదుర్కొంటారు. వ్యాపార సమస్యలను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.
కన్య కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగం వస్తుంది. శారీరకంగా దృఢంగా ఉంటారు. వ్యాపారంలో భాగస్వామ్యంతో లాభం ఉంటుంది. మీరు బాధల నుంచి ఉపశమనం పొందుతారు. చట్టపరమైన విషయాలు పెండింగ్‌లో ఉంటాయి.
తుల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వినోదం కోసం ధనం వెచ్చిస్తారు. ప్రేమికులు ఈరోజు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. కుటుంబ సభ్యులతో గడుపుతారు. అధిక పనిఒత్తిడి ఉంటుంది.
వృశ్చికం పిల్లలను సంతోషంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది. షేర్ మార్కెట్ నుంచి లాభం ఉంటుంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. కొత్త వ్యాపారం కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మీరు స్నేహితుల నుంచి సహాయం పొందుతారు.
ధనుస్సు కళా రంగానికి సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. బంధువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అనవసర వాదనలు పెట్టుకోవద్దు. ఎవరికైనా సలహాలు ఇచ్చే పని పెట్టుకోవద్దు. ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆస్తి విషయంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది.
మకరం మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. స్థిరాస్తులపై ఆదాయం పెరుగుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తలపెట్టిన పనులకు ఎక్కువ సమయం పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూకుడు వద్దు.
కుంభం ఈ రాశి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మద్యం, జూదానికి దూరంగా ఉండండి. మీరు ఆర్థికంగా నష్టపోతారు. తలపెట్టిన పనులు వాయిదా వేయకండి. విహారయాత్రకు వెళ్తారు . ప్రత్యర్థి ఎత్తుగడ వల్ల మీరు నష్టపోతారు. కొన్ని విషయాల్లో కొనసాగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి.
మీనం పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ఎవరి మీదా కోపం ప్రదర్శించకండి. ఈరోజు సాధారణంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. ఒకరి సలహా నుంచి ప్రయోజనం పొందుతారు.