![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vinayaka chavithi 2022: బానపొట్ట, పెద్ద చెవులు, చిన్న కళ్లు -వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!
Vinayaka Chavithi 2022: ఆగస్టు 31 బుధవారం వినాయకచవితి. ఈ సందర్భంగా విభిన్న కథనాలు అందిస్తోంది మీ ఏబీపీ దేశం. ఇందులో భాగంగా వినాయకుడిని రూపం వెనుకున్న పరమార్థం ఏంటో ఇక్కడ తెలుసుకోండి...
![Vinayaka chavithi 2022: బానపొట్ట, పెద్ద చెవులు, చిన్న కళ్లు -వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే! Ganesh Chaturthi 2022: This is the ultimate meaning behind Ganesha's rupam Vinayaka chavithi 2022: బానపొట్ట, పెద్ద చెవులు, చిన్న కళ్లు -వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/7cb9c7029c1162241a3751dff6e17b821661699497104217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vinayaka Chavithi 2022: వినాయక చవితి నుంచి తొమ్మిది రోజుల పాటూ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.ఆ తొమ్మిది రోజులూ ఊరూవాడా సంబరమే. అయితే గణపతి ఆరాధన మనలో ఎంతో కొంత మార్పు తీసుకువస్తేనే అది నిజమైన పండుగ అవుతుంది. వినాయకచవితి పండుగ మార్పును ఎలా తీసుకొస్తుంది అంటారేమో..నిజమే..పండుగ ఉత్సాహాన్ని నింపుతుంది కానీ మార్పుతీసుకురాదు.ఇక్కడ మార్పుతీసుకొచ్చేది పండుగ కాదు..వినాయకుడి రూపంవెనుకున్న పరమార్థం, ఆయన గుణగణాలు.
Also Read: ఇలాంటి వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తే ఇంట్లో వాస్తుదోషాలుండవ్, అన్నింటా సక్సెస్ అవుతారు!
లంబోదరుడు, బొజ్జ గణపయ్య, వినాయకుడు, పార్వతీ తనయుడు ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఆ రూపం వెనుక ఎంతో తాత్వికత ఉంది. ఎందుకంటే వినాయకుడు అని తలుచుకోగానే..బానపొట్ట, ఆ పొట్ట చుట్టూ సర్పం, వక్ర తొండం, నాలుగు చేతులు, ఎలుక వాహనం, చేటంత చెవులు కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వినాయక రూపం మనిషికి ఉండాల్సిన సద్గుణాలను చాటి చెబుతుంది.
Also Read: విఘ్నాధిపతిగా గణపతినే ఎందుకు పూజించాలి, వినాయక చవితి ప్రత్యేకత ఏంటి!
- పూర్ణకుంభంలాంటి ఆ దేహం పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు
- లంబోదరుడి పెద్దబొజ్జ భోజనప్రియత్వానికి చిహ్నం కాదు...జీవితంలో ఎదురయ్యే మంచిచెడులను జీర్ణించుకోవాలని తెలియజేస్తుంది.
- ఏనుగు తల మేధస్సుకు సంకేతమైతే. సన్నని కళ్ళు నిశిత పరిశీలనకు గుర్తు
- వక్రతుండం ఓంకార ప్రణవనాదానికి ప్రతీక
- ఏనుగు లాంటి ఆయన ఆకారాన్ని మోస్తున్న మూషికం ఆశకు చిహ్నం. మూషికం చిన్నగానే వున్నా ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది. వేగంగా కదులుతుంది. అంటే పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని చాటిచెబుతుంది.
- వినాయకుడి పొట్టచుట్టూ ఉండే సర్పం శక్తికి సంకేతం.
- విఘ్నేశుడి నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం
- చేతిలో ఉన్న పాశం, అంకుశం సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు
- చేటంత చెవులు... అనవసరమైన వ్యర్థమైన విషయాలను చేటలా చెరిగేసి అవసరమైన మంచి సంగతులను మాత్రమే స్వీకరించాలని సూచిస్తాయి
- చిన్న నోరు అతిగా మాట్లాడినందువల్ల అనర్థాలే తప్ప ఒరిగేదేం ఉండదు..ఎక్కువ తెలుసుకుని తక్కువ మాట్లాడాలని చెబుతోంది
- వినాయకుడు ధరించిన గొడ్డలి ఇహలోక బంధాలు శాశ్వతం కాదని, వాటిని తెంచేసుకోవాలని సూచిస్తోంది
- గణేషుడికి ఇష్టమైన లడ్డూ ఆశయాలకు అనుగుణంగా అడుగేస్తే విజయం మీ సొంతం అవుతుందని అర్థం
గణపతి తెలివితేటలకు ప్రతీక: వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని రాసింది ఆయనే. భారతం రాయడానికి వ్యాసుడికి ఓ లేఖకుడి అవసరం ఏర్పడింది. గణేశుని కన్నా సమర్థుడైన లేఖకుడు ఆయనకు కనిపించలేదు. తాను చెప్తుంటే భారతం రాసి పెట్టాల్సిందిగా కోరాడు వ్యాసుడు. అయితే గణపతి ఓ పరీక్ష పెట్టాలనుకున్నాడు. ‘మహర్షి నిజంగా తన హృదయాంతరాల్లో నుంచి పెల్లుబుకేది చెబుతారా? పాండిత్య ప్రదర్శన చేస్తారా?’ అని తెలుసుకోవడానికి ‘మీరు ఆపకుండా చెప్తేనే రాస్తాను. ఎక్కడైనా ఆపితే నేను కలం పక్కన పెట్టేస్తాను, మళ్లీ ముట్టుకోను’ అని సవాలు చేశాడు గణపతి. అందుకు అంగీకరించిన వ్యాసమహర్షి భారతమంతా ఆపకుండా చెప్పాడు. గణేశుడు ఒక్క అక్షరం పొల్లు పోకుండా, ఆగకుండా రాశాడు. అంతటి మేధాసంపత్తి గణపతి సొంతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)